ఘనంగా మహాత్మ గాంధీ 155 వ జయంతి వేడుకలు

ప్రజాశక్తి-కపిలేశ్వరపురం (కోనసీమ) : కపిలేశ్వరపురం మండలంలోని పలు గ్రామాల్లో బుధవారం మహాత్మ గాంధీ 155 వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు .ఈ సందర్భంగా అంగర, కపిలేశ్వరపురం, పడమర ఖండ్రిక , కేదార్లంక ,అద్దంకి వారి లంక , టేకి , కోరుమిల్లి , వల్లూరు, తదితర గ్రామాల్లోని పంచాయితీ కార్యాలయాల వద్ద , సర్పంచులు ప్రభుత్వ కార్యాలయాల వద్ద, అధికారులు ప్రజాప్రతినిధులు తదితరులు గాంధీ జీ విగ్రహాలకు, చిత్రపటాలకు ,పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అంగర పడమర కండ్రిక లో నిర్వహించిన జయంతి కార్యక్రమంలో గ్రామ సర్పంచులు వాసా కోటేశ్వరరావు, తిరునాతి ఆదిలక్ష్మి వెంకటేశ్వరరావు, ఉప సర్పంచ్‌ యర్ర వీరన్నబాబు, ఎంపీటీసీ అడ్డాల శ్రీనివాస్‌, తదితరులు గాంధీ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం గాంధీజీ సేవలను గూర్చి పలువురు వక్తలు కొనియాడారు . స్వీట్స్‌ పంపిణీ చేశారు . గాంధీ జయంతి సందర్భంగా పంచాయతీ పారిశుధ్య కార్మికులను ఘనంగా సన్మానించారు. అలాగే కపిలేశ్వరపురం మండల పరిషత్‌ కార్యాలయంలో ఎంపీపీ. మేడిశెట్టి సత్యవేణి ,జెడ్‌ పి టి సి .పుట్ట పూడి వీర వెంకట సూర్యనారాయణ, ఎంపీడీవో కొండలరావు, ఆధ్వర్యంలో గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో మండల పరిషత్‌ ఏవో ప్రకాష్‌,పలు గ్రామాల్లో సర్పంచులు ప్రజా ప్రతినిధులు ,అధికారులు నాయకులు తదితరులు పాల్గొన్నారు.

➡️