పలమనేరులో ఘనంగా మహాత్మా జ్యోతిరావు పూలే 199వ జయంతి వేడుకలు

ప్రజాశక్తి-పలమనేరు (చిత్తూరు) : చిత్తూరు జిల్లా పలమనేరు పట్టణంలో టవర్‌ క్లాక్‌ వద్ద మహాత్మ జ్యోతిరావు పూలే 199వ జయంతి వేడుకలు బీసీ ఫ్రంట్‌ ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం 9 గంటలకు ఘనంగా జరిగినవి. ఈ కార్యక్రమంలో చేసినటువంటి సమాజ సేవ కార్యక్రమాలను పలువురు బీసీ నాయకులు కొనియాడారు. ఈ కార్యక్రమంలో బిసిఎఫ్‌ నాయకులు గోవిందస్వామి, త్యాగరాజులు, పెద్దపంజాణి శ్రీనివాసులు, గడదేసివెంకటరమణ, బాలసుబ్రమణ, సుబ్రహ్మణ్యం గౌడ్‌, ఆనంద గౌడ్‌, నంజుండప్ప, నాగరాజ, మాజీ మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ కిరణ్‌ కుమార్‌, జూనియర్‌ కాలేజీ వైస్‌ ప్రిన్సిపాల్‌ శ్రీనివాసులు, ఏ.శివయ్య, కే.రత్నప్ప, మొదలగువారు పాల్గొన్నారు.

➡️