క్యాన్సర్ వ్యాధిపై అవగాహనా సదస్సు నిర్వహణ

Feb 4,2025 16:14 #Cancer, #East Godavari

ప్రజాశక్తి – ఉండ్రాజవరం : ప్రపంచ కేన్సర్ దినోత్సవంను పురస్కరించుకుని మండల కేంద్రం ఉండ్రాజవరం, వేలివెన్ను  ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో మంగళవారం  అవగాహనా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యాధికారులు కేన్సర్ వ్యాధి అనుమానిత లక్షణాలు తెలియచేస్తూ, నోటి కేన్సర్, గర్భాశయ కేన్సర్, బ్రెస్ట్ కేన్సర్ లను ముందుగానే గుర్తించి, సత్వర చికిత్స అందించటం వలన, వారిని కేన్సర్ వ్యాధి నుండి పూర్తిగా స్వస్థత పొందేటట్లు చేయవచ్చని తెలిపారు. గ్రామాల్లో నిర్వహిస్తున్న ఎన్ సి డి, సి డి సర్వేలో భాగంగా  కేన్సర్ లక్షణాలు గల వ్యక్తుల ను గుర్తిస్తే, వారిని వ్యాధి నిర్ధారణ కొరకు, రాజమండ్రి జనరల్ హాస్పిటల్ లో కేన్సర్ స్పెషలిస్ట్ వైద్యులచే  వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించి, వారికి కాన్సర్ నిర్ధారణ అయితే, తదుపరి చికిత్స కూడా ప్రభుత్వం  ఉచితంగా అందజేస్తుందని వారికి తెలియజేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్ర  వైద్యాధికారులు  డా. ఆర్. ఉషా దేవి,  డా. వై. సృజన, డాక్టర్.ఇర్ఫాన్  సి.హెచ్.ఓ సుబ్రహ్మణ్యం, పి.హెచ్.ఎన్  కె.డి.వి.ఎల్. కుమారి, హెల్త్ సూపర్వైజర్ జె.శ్రీనివాసరావు, ఎం పి హెచ్ ఈ ఓ, ఎస్ కె ఖాన్ ఎం పి హెచ్ ఎస్(ఎఫ్) కె. కె. సుభాషిణి,  ఎం.ఎల్.హెచ్.పి లు, ఏ. ఎన్. ఎం లు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️