ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : వంద రోజులు కూటమి ప్రభుత్వంలో ప్రజలకిచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమయ్యారని వైసిపి జిల్లా అధ్యక్షులు,జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు అన్నారు. బుధవారం స్థానిక జెడ్పీ ఛాంబర్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… గాంధీజీ కలలు గన్నా గ్రామ స్వరాజ్యం కోసం గత వైసిపి ప్రభుత్వం పాలన సాగిందన్నారు. వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రతి కుటుంబానికి ప్రజలకు అవసరమైన సేవలు అందించడం జరిగిందన్నారు. సుపరిపాలన కోసం సచివాలయం వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. నేడు వంద రోజులు పరిపాలన పూర్తి చేసుకున్న కూటమి పాలనలో మంచి ప్రభుత్వం అనే నినాదంతో ప్రజలు వద్దకు వెళ్తున్నారు. వంద రోజులు దాటింది లేదో ప్రజలు రోడ్డు ఎక్కుతున్నారన్నారు.ఉచిత ఇసుక విధానం వలన భవన నిర్మాణ కార్మికులు పనులు లేక రోడ్డు ఎక్కుతున్నారన్నారు. మా ప్రభుత్వం లో స్టాక్ పొయింట్ పెట్టీ టన్ను 700 కి ఇవ్వడం జరిగింది అన్నారు.నేడు టన్ను 1800 ఇచ్చిన దొరకని పరిస్తితి నెలకొందన్నారు. రైతులుకు మేము ఎరువులు రైతు భరోసా కేంద్రాలు ద్వారా అందించడం జరిగిందన్నారు. నేడు ఎక్కడా ఎరువులు అందే పరిస్తితి లేదన్నారు.ప్రైవేటు డీలర్లు ను ఆశ్రయించే పరిస్తితి ఉందన్నారు.ఎరువులు అందక రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు.వ్యవసాయ శాఖ మంత్రి ఎరువులు సకాలంలో ఇవ్వలేకపోయామని చెప్పే పరిస్తితి ఉందన్నారు.విద్యుత్ సిబ్బంది అలసత్వం వలన 22 మంది చనిపోవడం జరిగిందన్నారు.విద్యుత్ అధికారులు అలసత్వం నెలకొందన్నారు. బబ్బిలి లో విద్యుత్ ఘాతకంతో రైతు మరణించిన పరిస్తితి ఏర్పడిందన్నారు. పెన్షన్ లు ఇంటికి వెళ్లి ఇచ్చిన పరిస్తితి లేదన్నారు. గతంలో ఐదు రోజులు వ్యవధిలో ఇచ్చేవాలమన్నారు నేడు ఒక్క రోజుల్లో ఇచ్చేసి తర్వాత పెన్షన్ వచ్చే పరిస్తితి లేక పెన్షన్ దారులు భయాందోళన చెందుతున్నారన్నారు. దీంతో పాటు చేతి వాటం మొదలైందన్నారు. ముసలి వాళ్ళు,మంచం మీద ఉన్న వాళ్ళు పెన్షన్ తీసుకొనే పరిస్తితి లేదన్నారు. వర్షాలు కారణంగా పంటలు పోయి రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు.నీటిలో పంట మునిగిన రైతులకు భరోసా లేకుండా పోయిందన్నారు. యూరియా, డీ ఏ పి, అధిక ధరలకు అమ్ముతున్నారన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్నం బోజన పథకం పై పర్యవేక్షణ లేదన్నారు.ఇటీవలి ఎస్ కోట,బబ్బిలి లో జరిగిన ఘటనలు నిదర్శనమన్నారు. వంద రోజులు పరిపాలనలో గ్రామీణ ప్రాంతాలలో ప్రజలు అనారోగ్యాలు భారిన పడుతున్నారు. వారికి సరైన వైద్యం అందని పరిస్తితి నెలకొందన్నారు.ఆరోగ్య శ్రీ అమలు కావడం లేదన్నారు. ప్రైవేటు ఆసుపత్రిలో అమలు చేయడానికి వారు ముందుకు రావడం లేదన్నారు. విద్యుత్ భారాలు మోపమని చెప్పి నేడు భారాలు వేసేందుకు బాధుడిక్ సిద్దమయ్యారన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయడంలో విఫలమయ్యారన్నారు. వందలు రోజుల్లో ఇచ్చిన హామీలు ఇవి అమలు కాలేదన్నారు. ప్రభుత్వ వైద్య కళాశాల ముందుకు వెళ్ళే పరిస్తితి లేదన్నారు.భోగాపురం విమానాశ్రయం పనులు నిర్దిష్ట సమయంలో కాంట్రాక్టు తీసుకొన్న ఎల్ అండ్ టి వారు చేస్తారన్నారు. మీరు విమానాశ్రయం కోసం ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదన్నారు. మీ పర్యవేక్షణ ఉన్న లేకున్నా జరుగుతాయన్నారు. వంద రోజులు పరిపాలన విఫలమైందన్నారు . విలేకర్ల సమావేశంలో వైసిపి నాయకులు నెక్కల నాయుడుబాబు తదితరులు పాల్గొన్నారు.