సదస్సును విజయవంతం చేయాలి

May 25,2024 20:28

ప్రజాశక్తి-బొబ్బిలిరూరల్‌ : ఉపాధ్యాయ ఉద్యమ నేత, కీర్తిశేషులు శేషగిరి వర్థంతి సందర్భంగా విజయనగరంలో ఈ. నెల 27న నిర్వహించే రాష్ట్రస్థాయి విద్యా సదస్సును విజయవంతం చేయాలని యుటిఎఫ్‌ రాష్ట్ర నాయకులు కె.విజయగౌరి కోరారు. శనివారం స్థానిక ఎంఆర్‌సి కార్యాలయం వద్ద సదస్సు పోస్టర్‌ను ఆవిష్కరించారు. విజయనగరంలోని శేషగిరి విజ్ఞాన కేంద్రం సెల్లార్‌లో ‘విద్యారంగంలో పరిణామాలు – సవాళ్లు, కర్తవ్యాలు’ అనే అంశంపై సదస్సు జరుగుతుందని ఆమె తెలిపారు. సదస్సుకు శాసనమండలి మాజీ ప్రోటెం స్పీకర్‌ విఠపు బాలసుబ్రహ్మణ్యం ప్రధాన వక్తగా హాజరవుతారని చెప్పారు. జిల్లాలోని ఉపాధ్యాయులు హాజరుకావాలని కోరారు. కార్యక్రమంలో యుటిఎఫ్‌ బొబ్బిలి, రామభద్రపురం మండలా ప్రధాన కార్యదర్శులు బత్తుల శ్రీనివాస్‌, బి.శంకరరావు, సుధాకర్‌, అప్పలనాయుడు, అర్జున్‌, మన్యం జిల్లా నాయకులు మధు, చలపతి, రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు. నెల్లిమర్ల: ఈ నెల 27న జరగనున్న విద్యా సదస్సును జయప్రదం చేయాలని యుటిఎఫ్‌ జిల్లా కార్యదర్శి పతివాడ త్రినాధ్‌ పిలుపునిచ్చారు. శనివారం యుటిఎఫ్‌ ఆధ్వర్యంలో విద్యా సదస్సుకి హాజరై జయ ప్రదం చేయాలని కోరుతూ ఎంఇఒ-1 యు. సూర్య నారాయణ మూర్తి, ఎంఇఒ-2 విజరు కుమార్‌కు కరపత్రాలు అందజేసి ఆహ్వానించారు. ఈ సందర్భంగా పతివాడ త్రినాధ్‌ మాట్లాడుతూ ఈ నెల 27న జిల్లా కేంద్రంలోని కె.యల్‌.పురంలో నిర్మాణంలో ఉన్న శేషగిరి విజ్ఞాన కేంద్రం వద్ద యుటిఎఫ్‌, విజయనగరం జిల్లా శాఖ ఆధ్వర్యంలో విద్యా సదస్సు నిర్వహిస్తున్నామన్నారు. విద్యా సదస్సుకి శాసన మండలి మాజీ ఫ్లోర్‌ లీడర్‌ విఠపు బాలసుబ్రహ్మణ్యం కామ్రేడ్‌ శేషగిరి స్మారకోపన్యాసం చేస్తారని, యుటిఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు ఎన్‌.వెంకటేశ్వర్లు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ఎస్‌.ఎస్‌.ప్రసాద్‌ హాజరవుతారని తెలిపారు. ఈ సదస్సుకు మండలంలోని ఉపాధ్యాయులు అందరూ హాజరై జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో యుటిఎఫ్‌ నెల్లిమర్ల మండల శాఖ అధ్యక్షుడు మద్దిల సత్యనారాయణ, సహాధ్యక్షులు వంగపండు సురేష్‌ బాబు పాల్గొన్నారు.

➡️