ప్రజాశక్తి-పెద్దపంజాణి (చిత్తూరు) : ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (యు.టి.ఎఫ్) రాష్ట్ర స్వర్ణోత్సవ మహాసభలను విజయవంతం చేయాలని ఆదివారం రాష్ట్ర కార్యదర్శి జి.వి.రమణ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి ర్యాలీగా బయలుదేరి మహాత్మా పూలే వాల్మీకి మహర్షి తెలుగు తల్లి విగ్రహాలకు పూలమాల వేసినానంతరం, పుంగనూరు నుండి ప్రారంభమైన ప్రచార జాతాలో యుటిఎఫ్ ఆవిర్భవించి 50 సంవత్సరాలు పూర్తి అయిన నేపథ్యంలో రాష్ట్రస్థాయి స్వర్ణోత్సవ సంబరాలను జనవరి 5 నుండి 8వ తేదీ వరకు కాకినాడలో జరుగుతున్నాయి అని అన్నారు.ఈ మహాసభలకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్,దేశవ్యాప్తంగా విద్యావేత్తలు ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేయడం నిమిత్తం విద్యా సదస్సులకు హాజరవుతున్నారని అన్నారు. నాలుగు రోజులు పాటు జరిగే ఈ స్వర్ణోత్సవాల మహాసభలకు 20,000 మంది పైగా ఉపాధ్యాయులతో ప్రధానంగా విద్యా విధానానికి విఘాతం కలిగించే 117 జీవో రద్దు,ప్రభుత్వ విద్యారంగ బలోపేతం,సిపిఎస్ రద్దు , వీటితో పాటు పలు అంశాలను చర్చించి తీర్మానం చేయడం జరుగుతుంది అని అన్నారు. ఈ మహాసభలకు పుంగనూరు ప్రాంతం నుండి పెద్ద ఎత్తున ఉపాధ్యాయ మిత్రులు హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి జీ.వి రమణ,జిల్లా అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు ఎం.సోమశేఖర్ నాయుడు,ఎన్ మణి గండన్,జిల్లా నాయకులు జగన్మోహన్ రెడ్డి,ఈశ్వర మహేంద్ర,ఎంవి రమణ,ఎం పార్థసారథి,పిసీ బాబు, సి వెంకటేశ్వర రెడ్డి యాదవ్, చంద్రశేఖర్ రెడ్డి,రెడ్డప్ప, ఎం .శ్రీనివాసులు,శంకర్ రెడ్డి, సహదేవయ్యా,లోకనాథ్ రెడ్డి, విజరు కుమార్,సురేంద్ర రెడ్డి సుబ్రమణ్యం రెడ్డి,శంకర్, వేణు తదితరులు పాల్గొన్నారు.
యు.టి.ఎఫ్ రాష్ట్ర స్వర్ణోత్సవ మహాసభలను విజయవంతం చేయండి : రాష్ట్ర కార్యదర్శి. జి.వి.రమణ
