ప్రజాశక్తి-చల్లపల్లి (కృష్ణా) : సిపిఎం పార్టీ తొలి బ్యూరో క్యాబినెట్ సభ్యులు స్వాతంత్ర సమరయోధులు తెలంగాణ సాయుధ పోరాట యోధుడు కామ్రేడ్ మాకినేని బసవపున్నయ్య అని పలువురు నేతలు అన్నారు. బసవ పున్నయ్య 33వ వర్ధంతిని స్థానిక గుంటూరు బాపనయ్య శ్రామిక భవనంలో శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గన్న నేతలు మాట్లాడుతూ పేద ప్రజల కోసం ముఖ్యం పోరాటం చేసిన వ్యక్తిని, జీవితాంతం కమ్యూనిస్టు పార్టీ సిద్ధాంతం కోసం, కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య తో కలిసి పోరాటం చేశారని తెలిపారు. పల్లెలో పుట్టి పల్లె ప్రజల కష్టాలను తెలిసిన వ్యక్తి, ఆయన ఆశయ సాధన కోసం మనందరం పోరాటం చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచకర్ల రంగారావు, శీలం నారాయణరావు, వాకా రామచంద్రరావు, యద్దనపూడి మధు, మేడ%శీ%కి వెంకటేశ్వరారావు మరీదు సురేష్, బెజవాడ నాగేశ్వరరావు, లంకపల్లి సత్యనారాయణ, బళ్లా తదితరులు పాల్గన్నారు. తొలుతగా ఆయన చిత్రపటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
