గూగూడును పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దండి : దేవాదాయ శాఖ మంత్రిని కలిసిన ఎమ్మెల్యే శ్రావణిశ్రీ

ప్రజాశక్తి-నార్పల (అనంతపురం) : శింగనమల నియోజకవర్గ పరిధిలోని నార్పల మండలంలో జరిగే గూగూడు కుల్లాయి స్వామి బ్రహ్మౌత్సవాలు దేశవ్యాప్తంగా ప్రసిద్ధి అని ప్రతి ఏడాది లక్షలాదిమంది భక్తులు గూగూడు గ్రామానికి తరలివస్తారని భక్తుల సౌకర్యార్థం గూగూడులో పలు మౌలిక సౌకర్యాలతో పాటు గూగూడు గ్రామాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని అదేవిధంగా,శింగనమలలోని శ్రీ రుష్య శ్రుంగ మునీశ్వర దేవాలయం,బుక్కరాయసముద్రం మండలం లోని దేవరకొండ కొండమీదరాయుడి దేవాలయాల అభివఅద్ధికి తగిన ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి రామనారాయణ రెడ్డి కి ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ వినతి చేశారు.నియోజకవర్గ పరిధిలోని గూగూడు కుల్లాయిస్వామీ వారి ఉత్సవాలకు దేశంలోని పలు రాష్ట్రాల నుండి భక్తులు పెద్ద ఎత్తున పాల్గంటారని, ఉత్సవాలకు హాజరయ్యే భక్తులకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా సౌకర్యాలు ఏర్పాటు చేస్తూ,పర్యాటక పుణ్యక్షేత్రం గా గుర్తింపు తో పాటు పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని అలాగే శింగనమల మండలంలోని పురాతన చరిత్ర కలిగి, కొండలో ఉన్న శ్రీ రుష్య శ్రుంగ మునీశ్వర దేవాలయానికి రోడ్డు సౌకర్యం కల్పించి గుడి అభివృద్ధికి నిధులు విడుదల చేయాలని మంత్రి ని కోరారు. అలాగే బుక్కరాయసముద్రం మండల కేంద్రం లోని దేవరకొండ కొండమీదరాయుడి దేవాలయంలో ఇటీవల దక్షిణ భారతదేశంలోని అరుణాచాల అఖండ జ్యోతి తర్వాత మొట్టమొదటి సారిగా ఇక్కడ అఖండ జ్యోతి ఏర్పాటు చేయబడిందని. ఇక్కడ గత ప్రభుత్వ హయాంలో దేవాలయ భూమికి సంబంధించి అక్రమానలు తొలగించి, భక్తులకు గిరి ప్రదర్శన కొరకు సౌకర్యాలు కల్పించాలని వినతి చేశారు. సమస్యలన్నీ విన్న మంత్రి వాటిపై సానుకూలంగా స్పందించారని ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ తెలిపారు.

➡️