ప్రజాశక్తి-ఆచంట (పశ్చిమ గోదావరి జిల్లా) : దళితపేటలో ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులతో మౌలిక సదుపాయాలు కల్పించాలని మాల మహానాడు జిల్లా ఉపాధ్యక్షులు సరేళ్ల శ్రీనివాస్ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా, ఆచంట మండలం, కందరవల్లి గ్రామంలో మాల మహానాడు కార్యకర్తల సమావేశం మంగళవారం జరిగింది. ఈ సమావేశంలో ముందుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో శ్రీనివాస్ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా దళిత పేటలో అభివృద్ధి శూన్యం అన్నారు. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు విడుదల చేసి దళితపేటలో మౌలిక సదుపాయాలు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. ముఖ్యంగా దళిత పేటలో డ్రైనేజీలు నిర్మించాలని ఎస్సీ కమ్యూనిటీ భవనాలను అభివృద్ధి చేయాలని, కొత్త కమ్యూనిటీ భవనాలు నిర్మించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా నూతన కమిటీని ఏర్పాటు చేశారు. ఆచంట మండలం యూత్ ఉపాధ్యక్షులుగా రావి పెద్ద వెంకటేశ్వర రావు, కందరవల్లి గ్రామ అధ్యక్షులుగా పంతగాని ప్రసాద్ , గ్రామ ఉపాధ్యక్షులుగా కుక్కల వెంకటేశ్వర్లు, ను ఏకగ్రీవంగా ఎన్నుకొని నియమిక పత్రములు అందజేశారు. ఈ కార్యక్రమంలో మాలమహానాడు మండల అధ్యక్షులు రావి నాగరాజు, చిల్లే సురేష్, అరిగెల్ల పుల్లరావు, ,రావి ధర్మరావు, పెడతాట్ల వెంకటేశ్వర రావు, రావి చిన్న వెంకటేశ్వర రావు, రావి పెద్ద సత్యనారాయణ, రావి సజ్జన రావు, రావి శ్రీనివాస్, ఇంజటి శ్రీను, పంతగాని ధర్మ శేఖర్, కొల్లాబత్తుల సుభాష్, ఇంజటి ప్రకాష్, రావి అరుణ్ కుమార్, రావి తేజ, రావి బావురావు, రావి ఈశ్వర్ రావు, తదితరులు పాల్గొన్నారు.