మాల ప్రజా ప్రతినిధులారా ఇకనైనా కళ్ళు తెరవండి : మాల మహానాడు ఏపీ రాష్ట్ర అధ్యక్షులు

ప్రజాశక్తి-ఆచంట (పశ్చిమగోదావరి జిల్లా) : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వర్గీకరణ చేస్తానని హామీ ఇవ్వడం వెను వెంటనే సుప్రీంకోర్టు తీర్పునివ్వటం అందరికీ తెలిసిన విషయమే అయితే అలా జరిగితే జాతి నష్టపోతుందని ఒక మాల ప్రజా ప్రతినిధి కూడా గొంతు ఎత్తకపోవడం చాలా దారుణమని మాల మహానాడు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అధ్యక్షులు నన్నేటి పుష్ప రాజ్‌ అన్నారు. శుక్రవారం పశ్చిమగోదావరి జిల్లా ఆచంట మండలం ఆచంట గ్రామంలో మాల మహానాడు ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ … ముఖ్యమంత్రి చంద్రబాబును మాదిగ ప్రజాప్రతినిధులు కలిసి వర్గీకరణ పై త్వరగా నిర్ణయం తీసుకోవాలని కోరడం దీనిపై చంద్రబాబు స్పందించి త్వరలో నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని అని చెప్పడం దారుణం అన్నారు. మాల ప్రజాప్రతినిధులు మన జాతికి జరుగుతున్న నష్టం పై మీరెందుకు ముఖ్యమంత్రి చంద్రబాబును నిలదీయరని మీకు పదవులు కావాలి. జాతి మాత్రం మీకు అవసరం అవసరం లేదా అని ధ్వజమెత్తారు. ఇప్పటికైనా మాల ప్రజాప్రతినిధులు వర్గీకరణను అడ్డుకోకపోతే చరిత్రహీనులుగా మిగిలిపోతారని పుష్పరాజ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబుకు గతంలో మాలలు తగిన బుద్ధి చెప్పారని అయినా సరే ఒక జాతికి పట్టం కట్టడం దారుణమని అన్నారు రానున్న రోజుల్లో మాలలు సత్తా ఏంటో చూపిస్తామని పుష్పరాజ్‌ హెచ్చరించారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి నేతల సువర్ణ రాజు, జిల్లా ఉద్యోగుల సంఘం అధ్యక్షులు నేతల సాల్మన్‌ రాజు, జిల్లా అధ్యక్షులు ఇంటి సుందర్‌ కుమార్‌, జిల్లా కార్యదర్శి కోలాటి ప్రసాదరావు, చిల్లే రాజ్‌ కుమార్‌ బాబు, రాజేంద్రప్రసాద్‌, చిగురుపాటి రాజేష్‌ , తోర్లపాటి భాగ్యరాజ్‌ , దాసరి, తదితరులు పాల్గొన్నారు.

➡️