మలేరియా నిర్మూలన ర్యాలీ

Jun 11,2024 12:26 #Malaria Eradication Rally

ప్రజాశక్తి-చాగల్లు (తూర్పు గోదావరి) : మలేరియా మాసోత్సవం సందర్భంగా … మంగళవారం ప్రాధమిక ఆరోగ్య కేంద్రం బ్రాహ్మణగూడెం గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ కే.నిషిత మాట్లాడుతూ …. ఈ నెల చివరి వరకు మలేరియా మసోత్సవం నిర్వహించటం జరుగుతుందన్నారు. దోమల నియంత్రణ-మనందరి బాధ్యత, చిన్నదోమ-పెను ప్రమాదం, దోమ పుట్టరాదు-దోమ కుట్టరాదు, దోమ తెరలు వాడండి – దోమ కాటు నివారించండి, చేయి చేయి కలుపుదాం – మలేరియా వ్యాధిని నివారిద్దాం అనే నినాదంతో ఆరోగ్య సిబ్బందితో ర్యాలీ బ్రాహ్మణగూడెం లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్‌ కే.నిషితా , పి ఆర్‌ ఎల్‌హొ దేవి, వి.పద్మ, ఎం.రాజశేఖర్‌, డివి.రామకఅష్ణ, ఏఎన్‌ఎం, ఆషాలు పాల్గొన్నారు.

➡️