వైసిపి అక్రమాలపై మాలేపాటి ధ్వజం

Sep 29,2024 21:58
ఫొటో : మాట్లాడుతున్న రాష్ట్ర టిడిపి ఉపాధ్యక్షులు మాలేపాటి సుబ్బానాయుడు

ఫొటో : మాట్లాడుతున్న రాష్ట్ర టిడిపి ఉపాధ్యక్షులు మాలేపాటి సుబ్బానాయుడు

వైసిపి అక్రమాలపై మాలేపాటి ధ్వజం

ప్రజాశక్తి-కావలి : గత ప్రభుత్వంలో జరిగిన వైసిపి అక్రమాలపై, తిరుమల లడ్డు ప్రసాదంలో జరిగిన అవినీతిపై రాష్ట్ర టిడిపి ఉపాధ్యక్షులు మాలేపాటి సుబ్బానాయుడు ధ్వజమెత్తారు. కావలిలోని వారి కార్యాలయంలో జిల్లా టిడిపి ఉపాధ్యక్షులు మన్నవ రవిచంద్రతో కలిసి ఆదివారం పత్రికా విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాలేపాటి మాట్లాడుతూ తిరుమల లడ్డు ప్రసాదంలో జరిగిన అవినీతిపై ధ్వజమెత్తారు. వైసిపి నేతల అధికార దాహానికి అవధులు లేకుండా పోయాయన్నారు. కూటమి ప్రభుత్వం అంటే పనిచేసే ప్రభుత్వమని, ఈ వందరోజుల పాలనలో దానికి నిర్వచనం చెప్పామని, అదే వైసిపి ప్రభుత్వం పర్సెంటేజీల ప్రభుత్వమని మండిపడ్డారు. వైసిపి వారు టిడిపిలోకి ఏ విధంగా చేరాలి అనే ఆలోచనతో నిరంతరం టిడిపి వారి చుట్టూ తిరుగుతున్నారని, వైసిపి వారికి టిడిపిలో ఏం పని ఉందంటూ ప్రశ్నించారు. ఎప్పటికైనా మాలేపాటి అంటే టిడిపి అని, అందులో ఎటువంటి తారతమ్యం ఉండదని, ఇక్కడ పార్టీ భేదాలు ఉండవని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

➡️