కాకినాడ ఆర్ డి ఓ గా మల్లిబాబు బాధ్యతలు స్వీకరణ

Oct 4,2024 18:33 #Kakinada

ప్రజాశక్తి – కాకినాడ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం డిప్యూటీ సీఈవోగా పనిచేస్తూ సాధారణ బదిలీల్లో భాగంగా కాకినాడ జిల్లా, కాకినాడ ఆర్డీవోగా నియమితులైన ఎస్.మల్లిబాబు శుక్రవారం కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగిలి, జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా, డీఆర్వో డా.డి.తిప్పేనాయక్ లను మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం కాకినాడ రెవిన్యూ డివిజన్ కార్యాలయంలో ఆర్డీవోగా ఎస్.మల్లిబాబు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో వివిధ మండలాల తహశీల్దార్ గా, జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ప్రాజెక్ట్ అధికారిగా, పెద్దాపురం ఆర్డీవోగా, సెట్ రాజ్ సీఈవోగా పనిచేసిన అనుభవంతో జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులను సమన్వయం చేసుకుంటూ కాకినాడ రెవిన్యూ డివిజన్ ప్రజల సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి చేయడం జరుగుతుందన్నారు. ఆర్డీవో కార్యాలయ అధికారులు, సిబ్బంది, కాకినాడ డివిజన్ పరిధిలోని వివిధ మండలాల తహశీల్దార్లు ఈ సందర్భంగా ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.

➡️