ప్రజాశక్తి-పులివెందుల టౌన్ (కడప) : బాకీ డబ్బులు అడిగినందుకు వ్యక్తిపై తుపాకీతో దాడి చేసిన ఘటన బుధవారం పులివెందుల టౌన్‌లోని లయోలా డిగ్రీ కాలేజ్ సమీపంలోనీ క్లబ్ దగ్గర జరిగింది. లయోలా డిగ్రీ కాలేజ్ సమీపంలోనీ క్లబ్ దగ్గర ఆర్.తుమ్మలపల్లి గ్రామానికి చెందిన కోరా నాగిరెడ్డి కి శివప్రసాద్ బాకీ ఉన్నాడు. అయితే నాగిరెడ్డి బాకీ డబ్బులు అడగటంతో ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. వెంటనే శివ ప్రసాద్ తన మిత్రుడు బబ్లు కు ఫోన్ చేసి సమాచారం ఇచ్చాడు. బబ్లు నాటు తుపాకీతో వచ్చి నాగిరెడ్డి తలపై దాడిచేసి తీవ్రంగా గాయపరిచాడు. గమనించిన స్థానికులు చికిత్స కోసం నాగిరెడ్డిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ విషయమై పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.