ప్రజాశక్తి-బాడంగి : పురుగుల మందు తాగి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన మండలంలోని వీరసాగరం గ్రామంలో చోటుచేసుకుంది. ఎస్‌ఐ తారకేశ్వరరావు కథనం ప్రకారం…బొబ్బిలికి చెందిన చప్ప రామారావు (42)కు భార్య గంగ, ఇద్దరు పిల్లలు ఉన్నారు. గురువారం మండలంలోని వీరసాగరంలో ఉన్న గంగ కన్నవారింటికి వచ్చారు. రామారావు మద్యం తాగి, గొడవపడటంతో గంగ మందలించింది. దీంతో రాత్రి 8 గంటల సమయంలో రామారావు బయటకు వెళ్లి పురుగుల మందు తాగాడు. గ్రామస్తులు చూసి కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు. వెంటనే వైద్యం కోసం బాడంగి సిహెచ్‌సికి తీసుకెళ్లారు. అనంతరం మెరుగైన వైద్య కోసం జిల్లా కేంద్రాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం మధ్యాహ్నం రామారావు మరణించాడు. ఆయన భార్య గంగ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తారకేశ్వరరావు తెలిపారు.
