పాము కాటుకు వ్యక్తి మృతి

May 28,2024 11:24 #chittore, #man died, #snake bite

ప్రజాశక్తి-బంగారుపాళ్యం (చిత్తూరు) : పాము కాటుకు వ్యక్తి మృతి చెందిన సంఘటన చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం కె.జి.సత్రం గ్రామంలో సోమవారం రాత్రి జరిగింది. కుటుంబ సభ్యులు ఇచ్చిన వివరాల మేరకు … గ్రామానికి చెందిన ఎస్‌.మునికఅష్ణ (56) ఇంటి అరుగుపై నిద్రిస్తుండగా కట్ల పాము అతని చెవిపై కాటేయడంతో అతను లేచి పామును చంపి సమీపంలో ఉన్న ఇంటివారిని నిద్రలేపి పాము కాటేసిన విషయం తెలుపగా వారు వెంటనే చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం మరణించినట్లు డాక్టర్లు తెలిపారు. ఇతనికి వివాహం కాలేదు. కేజీ సత్రంలోని మాంస దుకాణాన్ని ఉపయోగించుకొని జీవనం సాగిస్తుండేవాడు.

➡️