ప్రజల మనిషి షడ్రక్‌ వర్ధంతి – ఉచిత మెడికల్‌ క్యాంపు

ప్రజాశక్తి-కర్నూలు క్రైమ్‌ : నిత్యం ప్రజా సమస్యలపై పోరాటం చేసిన ప్రజల మనిషి, ఉద్యమ నిర్మాత కామ్రేడ్‌ షడ్రక్‌ అని ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జి రామకఅష్ణ అన్నారు. ఆదివారం కామ్రేడ్‌ షడ్రక్‌ 4వ వర్ధంతి సందర్భంగా … డివైఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షులు రాఘవేంద్ర అధ్యక్షతన కర్నూలు మండలం ఉల్చాల గ్రామంలో అమిలియో హాస్పిటల్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరానికి హాజరై మాట్లాడారు. కామ్రేడ్‌ షడ్రక్‌ ప్రజా ఉద్యమ నిర్మాత అని అన్నారు. ఇల్లు లేని పేదల కోసం భూమిలేని పేదల కోసం పోరాటాలు నిర్వహించి వేలాదిమందికి జీవనాధారం చూపారని అన్నారు. జిల్లాలో కుల వివక్షకు వ్యతిరేకంగా అంటరానితనానికి వ్యతిరేకంగా అనేక ఉద్యమాలు నడిపారని అన్నారు. టి.షడ్రక్‌ ఐటిఐ పూర్తి చేసిన తర్వాత పేపర్‌ మిల్లు లో అప్రెంటిస్‌గా చేరి కార్మిక సంఘం ఏర్పాటు చేసి కార్మికుల హక్కుల కోసం సమాన వేతనాల కోసం అనేక ఉద్యమాలు నిర్మించి నిర్బంధాలు ఎదుర్కొన్న ఘనత షడ్రక్‌ గారిదని అన్నారు. పేపర్‌ మిల్లు యాజమాన్యం కామ్రేడ్‌ టి షెడ్రక్‌ పై కచ్చగట్టి సహించలేక నాయకులను తొలగిస్తే ఉద్యమం ఆగిపోతుందని కార్మిక సంఘం బలహీన పడుతుందని అనుకుని మిల్లు నుండి టీ షడ్రక్‌ గారిని తొలగించిందని అయినప్పటికీ కార్మికుల హక్కుల కోసం త న జీవితాన్ని సంపూర్ణంగా అర్పితం చేసి అనేక ఉద్యమాలకు పోరాటాలకు బాటలు వేశారని చివరి కంటూ పేదల కోసం కార్మికుల కోసం పనిచేసిన వ్యక్తి అని కొనియాడారు . 75 సంవత్సరాల స్వతంత్ర భారతంలో పాలకుల నిర్లక్ష్యం వల్ల రాజకీయ నాయకుల అహంకార అవినీతి వల్ల నేటికీ ఇల్లు లేని పేదలు భూమిలేని పేదలు వేలాది మంది లక్షల మంది ఉన్నారని అన్నారు. కామ్రేడ్‌ షడ్రక్‌ గారి స్ఫూర్తితో పాలకుల నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా పోరాడి పేదరిక నిర్మూలన కోసం పేదల జీవనాధారం కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. డివైఎఫ్‌ఐ ఏపీ రైతు సంఘం తమ యొక్క కార్యక్రమాలను చేస్తూనే బహుమకంగా సేవా తత్పరత కార్యక్రమాలను చేపడుతుందని అందుకు ప్రజల సహకారం అవసరమని అన్నారు %ణ్‌ఖీ×% అవినీతి అంతం డివైఎఫ్‌ఐ పంతం అనే నినాదంతో అవినీతి అక్రమాలపై నిరంతరం పోరాడుతుంది నిరుద్యోగ యువత కోసం ఉపాధి అవకాశాలు కల్పించాలని జాబు క్యాలెండర్లు విడుదల చేయాలని కోతి యువకులను సక్రమ మార్గంలో పెట్టేదానికోసం నిరంతరం కఅషి చేస్తుందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం నాటి నిజాం నవాబుకు వ్యతిరేకంగా వీరోచిత రైతాంగ పోరాటం మొదలుకొని 2021లో ఢిల్లీలో వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా సంవత్సరం కాలం పాటు పోరాడినటువంటి చరిత్ర రైతు సంఘానికి ఉందని స్థానిక సమస్యలతో పాటు అనేక కార్యక్రమాలు నిర్వహిస్తుందని తెలిపారు పేదలకు ఉచిత వైద్యం అందిస్తున్న హాస్పిటల్స్‌ డాక్టర్స్ష సహకారం తీసుకుని ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించే దానికోసం కఅషి చేస్తుందని వాటిలో భాగంగానే ఉంచాల గ్రామంలో ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం గ్రామ కమిటీ డివైఎఫ్‌ఐ గ్రామ కమిటీలు చేసినటువంటి కఅషి ప్రశంసనీయమని ఆయన కొనియాడారు. కామ్రేడ్‌ టీ షడ్రక్‌ గారి వర్ధంతి సందర్భంగా అమిలియో హా స్పటల్‌ యాజమాన్యంఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం చాలా సంతోషమని ఇలాంటి అనేక కార్యక్రమాలు భవిష్యత్తులో జరగాలని తెలియజేశారు. ఉచిత వైద్య శిబిరానికి సహకరించిన అమీ లియో హాస్పిటల్‌ సిబ్బందిని గ్రామ డివైఎఫ్‌ఐ యువజన సంఘం ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం కమిటీలను కఅతజ్ఞతలు తెలిపాయి. ఉచిత వైద్య శిబిరంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి అబ్దుల్లా రైతు సంఘం గ్రామ కార్యదర్శి ఇస్మాయిల్‌ నాయకులు వెంకటయ్య లోకన్నా చిన్నబడే సాహెబ్‌ డివైఎఫ్‌ఐ మండల కార్యదర్శి ప్రకాష్‌ గ్రామ కార్యదర్శి కిషన్‌ ఎస్‌ఎఫ్‌ఐ మండల కార్యదర్శి అంజి డివైఎఫ్‌ఐ ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు చాణిక్య రాము మనోహర్‌ శివ గోవర్ధన్‌ హరిబాబు రాజేష్‌ ప్రకాష్‌ విశ్వ వేణు తదితరులు పాల్గన్నారు. ఉచిత వైద్య శిబిరాన్ని గ్రామ ప్రజలు 200 మంది సద్వినియోగం చేసుకున్నారు.

➡️