గోకుల షెడ్యూల్‌ ను ప్రారంభించిన మండల కన్వీనర్‌ శ్రీనివాసులు

ప్రజాశక్తి-ఆత్మకూరు (అనంతపురం) : మాజీ మంత్రి రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీతమ్మ ఆదేశాల మేరకు మండలంలో 109 షెడ్లను మంజూరు చేయించారు. శుక్రవారం మండల కన్వీనర్‌ శ్రీనివాసులు మాట్లాడుతూ … నూతనంగా నిర్మించిన గోకులం షెడ్లును నేడు ఆత్మకూరు , ముట్టాల గోరిదిండ్ల పియాలేరు, సిద్దరాంపురం, వడ్డిపల్లి మదిగుబ్బ సనప బియాలేరు గ్రామాలలో ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ నిధులతో నూతనంగా నిర్మించిన క్యాటిల్‌ షెడ్లను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో. ఎంపీడీవో లక్ష్మి నరసింహులు ఏపీవో సుజాత హిందూపురం పార్లమెంట్‌ అధికారి ప్రతినిధి శశాంక్‌ బాబు తెలుగు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నారాయణస్వామి ఓబులపతి అక్కులప్ప దాస్‌ ఆదెమ్మ లింగన్న వెంకటరామిరెడ్డి తిమ్మరాజు నాగభూషణ చిన్న రాయుడు, ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ సిబ్బంది, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

➡️