ప్రజాశక్తి-శింగరాయకొండ : సీజన్‌లూ మారిపోతున్నాయి. ఏప్రిల్, మేలో రావలసిన మామిడికాయలు డిసెంబర్, జనవరిలో వచ్చేశాయి. శింగరాయ కొండ మండలంలోని జాతీయ రహదారి పరిధిలోని కనుమళ్ల కలికివాయి మధ్యలో దాదాపు 50 షాపుల వరకు మామిడికాయలు పెట్టుకొని అమ్మకాలు చేపడుతున్నారు. జాతీయ రహదారిపై దూర ప్రాంతాలు వెళ్లే వారంతా వీటిని కొనుగోలు చేస్తున్నారు. అయితే సీజన్ కాకపోయినటప్పటికీ ఇప్పుడు ఈ మామిడికాయలు ఎలా వచ్చాయని వినియోగదారులు ఆలోచనలోపడుతున్నారు. ఈ మామిడికాయలు చూడడానికి నోరూరించేలా ఉన్నాయని, తినడానికి అంతగా రుచి లేవని అంటున్నారు. కార్బెట్ పెట్టడం వల్ల ఇలా ఆకర్షణీయమైన రంగులోకి వచ్చాయని చెబుతున్నారు.