చంద్ర ఘంట అలంకారంలో మన్నూరు ఎల్లమ్మ తల్లి

ప్రజాశక్తి-రాజంపేట అర్బన్‌ (కడప) : దసరా ఉత్సవాలలో భాగంగా పట్టణంలోని మన్నూరులో వెలసిన శ్రీ శ్రీ శ్రీ ఉదయగిరి ఎల్లమ్మ తల్లి మూడవ రోజు శనివారం చంద్ర ఘంట అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ అర్చకులు కొర్రపాటి రవి మోహన్‌ స్వామి, నవీన్‌ కుమార్‌ స్వామి ఉదయం అమ్మవారికి అభిషేక కార్యక్రమాన్ని నిర్వహించి, కుంకుమార్చన చేసి, నైవేద్యాలను సమర్పించారు. ఈ కార్యక్రమంలో భక్తాదులు పెద్దఎత్తున పాల్గని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.

➡️