పల్లెవెలుగు బస్సును ఢీకొట్టిన ప్రైవేటు బస్సు – పలువురికి గాయాలు

ప్రజాశక్తి-విజయనగరం కోట : పల్లెవెలుగు బస్సును ప్రైవేటు ట్రావెల్‌ బస్సు ఢీకొట్టడంతో పలువురు ప్రయాణీకులకు స్వల్పగాయాలైన ఘటన శుక్రవారం విజయనగరం కోటలో జరిగింది. ఈరోజు ఉదయం పూల్‌ బాగ్‌ అయ్యప్పనగర్‌ వద్ద స్పీడ్‌ బ్రేకర్స్‌ దాటుతున్న పల్లె వెలుగు బస్సును వెనుక నుంచి ప్రైవేట్‌ ట్రావెల్‌ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పలువురు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి.

➡️