ఆరు కిలోల గంజాయి స్వాధీనం

Feb 11,2024 21:25

పాచిపెంట : ఒడిస్సా నుంచి ఘాట్‌ రోడ్డు మీదుగా అక్రమంగా తరలిస్తున్న ఆరు కిలోల గంజాయిని ఆదివారం స్వాధీనం చేసుకున్నట్లు స్థానిక ఎస్సై పి.నారాయణ రావు తెలిపారు. ఆయన అందించిన వివరాలిలా ఉన్నాయి. ఆదివారం పి.కోనవలస చెక్పోస్ట్‌ వద్ద వాహనాలు తనిఖీ చేయగా, ఒడిశాకు చెందిన సానియా జమీ, కేదార్నాథ్‌ పాత్రో చెక్‌ పోస్ట్‌ మీదుగా సాలూరు వైపు సుమారు 6 కిలోల గంజాయితో పట్టుబడ్డరు. గంజాయి స్వాధీనం చేసుకొని వారిపై కేసు నమోదు చేశామన్నారు. సాలూరు రూరల్‌ సిఐ బాలకృష్ణ ముద్దాయిలను అరెస్టు చేసి రిమాండ్‌కు పంపించారు. ఎస్సై నారాయణరావు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

➡️