జనసేనలోకి జయకృష్ణ

Apr 1,2024 21:10

పాలకొండ : టిడిపి నియోజకవర్గ ఇన్‌-ఛార్జ్‌ నిమ్మక జయకృష్ణ సోమవారం పిఠాపురంలో జనసేన ఖండువా కప్పుకున్నారు. కూటమి పొత్తులో భాగంగా పాలకొండ నియోజకవర్గం జనసేనకు సీటు కేటాయించడంతో తెలుగుదేశం నుంచి టికెట్‌ ఆశిస్తున్న జయకృష్ణకు జనసేన తరుపున టికెట్‌ ఇస్తున్నట్లు సమాచారం. టిడిపిలో నాలుగున్నర ఏళ్ల ఇన్‌-ఛార్జ్‌ గా పని చేసి, పార్టీను ముందుకు తీసుకెళ్లిన జయకృష్ణకు అవకాశం ఇవ్వాలని అంతా భావించారు. అనుకున్నట్లే జయకృష్ణకు జనసేన తరుపున టికెట్‌ కేటాయించినట్లు తెలుస్తుంది. జనసేన నాయకులు కూడా జనసేన టికెట్‌ జయకృష్ణకు ఇవ్వాలని పవన్‌ కల్యాణ్‌కు కోరినట్టు తెలుస్తుంది.

➡️