సిపిఎం, ఇండియా వేదిక అభ్యర్థులను గెలిపించాలి

Apr 2,2024 22:15

పార్వతీపురంరూరల్‌ : రానున్న ఎన్నికల్లో సిపిఎం, ఇండియా వేదిక అభ్యర్థులను గెలిపించాలని సిపిఎం రాష్ట్ర సీనియర్‌ నాయకులు ఎం.కృష్ణమూర్తి పిలుపునిచ్చారు. మంగళవారం స్థానిక సుందరయ్య భవనంలో పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికల్లో సిపిఎం, ఇండియా గ్రూపు అభ్యర్థులను గెలిపించాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు రెడ్డి శ్రీదేవి అధ్యక్షతన జరిగిన సిపిఎం పార్టీ విస్తృత సమావేశంలో ఆయన మాట్లాడారు. మతోన్మాదం, రాజ్యాంగ విచ్ఛన్నకర విధానాలను అనుసరిస్తున్న రాష్ట్ర ప్రయోజనాలను, హక్కులను దెబ్బతీసిన, అధిక ధరలతో భారాలు పెంచుతున్న బిజెపిని ఓడించాలని పిలుపునిచ్చారు. అలాగే బిజెపికి ప్రత్యక్షంగా, పరోక్షంగా మద్దతు ఇస్తూ బలపరుస్తున్న లొంగిపోయిన రాష్ట్రంలోని టిడిపి, వైసిపి, జనసేనను ఓడించాలని కోరారు. ప్రజాప్రయోజనాలను, రాజ్యాంగాన్ని, హక్కులను కాపాడే సిపిఎం అరకు అభ్యర్థిగా పోటీ చేస్తున్న పి.అప్పలనర్స, ఇండియా గ్రూపులో భాగస్వామ్యులను గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి రెడ్డి వేణు, నాయకులు బంటు దాసు, గొర్లె వెంకటరమణ, కె.రామస్వామి, బంకులు సూరిబాబు, టి.రాము, కృష్ణ, పార్టీ కార్యకర్తలు, సానుభూతి పనులు పెద్దఎత్తున పాల్గొన్నారు.

➡️