హెచ్‌ఎంలకు ఉద్యోగోన్నతులు కల్పించాలి

Feb 12,2024 21:48

 సీతంపేట : ఆశ్రమ ఉన్నత పాఠశాలల్లో ఖాళీగా ఉన్న పిజిహెచ్‌ఎంలకు ఉద్యోగోన్నతులు కల్పించాలని, ఆదివాసీ బహుభాషా ఉపాధ్యాయులకు మార్చి, ఏప్రిల్‌లో కొనసాగించాలని యుటిఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి జిల్లా కార్యదర్శి ఎస్‌.మురళీమోహనరావు, కార్యదర్శి కె.కృష్ణారావు ఐటిడిఎ పిఒ కల్పనాకుమారికి స్పందన కార్యక్రమంలో వినతి పత్రం అందజేశారు. పిఒ ఆధ్వర్యంలో స్థానిక ఐటిడిఎలో స్పందన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మురళీమోహన్‌ మాట్లాడుతూ అనేక ఏళ్ల నుంచి పిజిహెచ్‌ఎంల పోస్టులు ఖాళీగా ఉన్నాయని, దీనివల్ల విద్యార్థులు నష్టపోతున్నారని అన్నారు. అలాగే ఉపాధ్యాయ, ఉద్యోగోన్నతలు లేకుండా రిటైర్‌ అవుతున్నారని అన్నారు. సవర భాషా వాలంటీర్లను మార్చి, ఏప్రిల్‌లో కొనసాగించేలా చూడాలని, దీనివల్ల విద్యార్థులు డ్రాప్స్‌ అవుట్స్‌ తగ్గుతుందని అన్నారు. కావున పై సమస్యలు పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని పిఒను కోరారు.

➡️