16న గ్రామీణ బంద్‌

Feb 12,2024 21:47

సీతంపేట : దేశవ్యాప్తంగా ఈనెల 16న జరుగు గ్రామీణ భారత్‌ బంద్‌లో కార్మికులు వ్యవసాయ కూలీలు రైతులు పాల్గొని జయప్రదం చేయాలని సంయుక్త కిసాన్‌ మోర్చా, కార్మిక సంఘాల జెఎసి ఉమ్మడిగా పిలుపునిచ్చాయి. సిఐటియు జిల్లా అధ్యక్షులు దావాలా రమణారావు, మండలం అధ్యక్ష కార్యదర్శులు ఎస్‌.సురేష్‌, ఎం. కాంతారావు మాట్లాడుతూ దేశంలో నరేంద్ర మోడీ నాయకత్వంలోని బిజెపి ప్రభుత్వం కార్పొరేట్‌ మతతత్వ విధానాలను అవలంబిస్తుందని మోడీ ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజలకు వివరించేందుకు ఈ కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను కార్మికులు, రైతులు, వ్యవసాయ కూలీలు, ఉద్యోగుల వద్దకు తీసుకెళ్లి బిజెపి అవలంబిస్తున్న కార్పొరేట్‌ విధానాలను వ్యతిరేకిస్తూ రానున్న ఎన్నికల్లో ఈ విధానాలను వ్యతిరేకించి అన్ని కార్మిక వర్గాలు పోరాటంలోకి వచ్చేందుకు జరుగుతున్న దేశవ్యాప్త కార్మికుల సమ్మె గ్రామీణ భారత్‌ బంద్‌ జయప్రదం చేయాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపై ఉందని తెలిపారు.పాచిపెంట : మండల కేంద్రంలో కార్మిక సంఘాలు రైతు కిసాన్‌ మోర్చా ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఫిబ్రవరి 16 సమ్మె విజయవంతం చేయాలని కార్మిక సంఘాల నాయకులు పిన్నింటి రమేష్‌, రైతు సంఘం నాయకులు బోని గౌరునాయుడు, సిఐటియు నాయకులు కోరాడ ఈశ్వరరావు, చింత పోలిరాజు, ఆదివాసీ గిరిజన సంఘం నాయకులు సూకురు లక్ష్మణరావు ఆధ్వర్యంలో పాచిపెంట ఆర్టీసీ కాంప్లెక్స్‌ ఆవరణలో నిరసన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బిజెపి విధానాలకు వ్యతిరేకంగా రైతాంగ పోరాట స్ఫూర్తితో దేశవ్యాప్తంగా ప్రజలంతా కదులుతున్నారని, కావున ఈనెల 16న జరుగు దేశవ్యాప్త సమ్మెలో భాగంగా కార్మికులు, ప్రజలు రైతులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని అన్నారు పాలకొండ : దేశవ్యాప్తంగా ఈనెల 16న జరుగు గ్రామీణ భారత్‌ బంద్‌లో కార్మికులు, వ్యవసాయ కూలీలు, రైతులు పాల్గొని జయప్రదం చేయాలని సంయుక్త కిసాన్‌ మోర్చా, కార్మిక సంఘాల జెఎసి ఉమ్మడిగా పిలుపునిచ్చాయి. సిఐటియు పాలకొండ మండల సమన్వయ కమిటీ కార్యదర్శి కాదా రాము, రైస్‌ మిల్‌ వర్కర్స్‌ యూనియన్‌ అధ్యక్షులు గేదెల సత్యం, ఎడ్ల శ్రీనివాసరావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను కార్మికులు, రైతులు, వ్యవసాయ కూలీలు, ఉద్యోగుల వద్దకు తీసుకెళ్లి రానున్న ఎన్నికల్లో ఈ విధానాలను వ్యతిరేకించి, అన్ని కార్మిక వర్గాలను పోరాటంలోకి తీసుకొచ్చేందుకు జరుగుతున్న దేశవ్యాప్త కార్మికుల సమ్మె గ్రామీణ భారత్‌ బంద్‌ జయప్రదం చేయాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపైనా ఉందని తెలిపారు. కార్యక్రమంలో రైస్‌ మిల్‌ కార్మికులు పాల్గొన్నారు.పార్వతీపురంరూరల్‌: ఈనెల 16న దేశవ్యాప్తంగా జరుగుతున్న గ్రామీణ బంద్‌ విజయవంతం చేయాలని రైతు సంఘాల సమన్వయ కమిటీ నాయకులు కోరారు. ఈమేరకు మండలంలోని పలు గ్రామాల్లో ఆటో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ మోడీ పాలనలో వ్యవసాయ రంగం నాశనం ఆవుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నల్ల చట్టాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసే విధంగా మోడీ విధానాలు అమలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. బిజెపి అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై వ్యవసాయ కార్మికులు, రైతులు, రైతు కూలీలు, కార్మికులు ఐక్యం కావాలని ఈనెల 16 జరిగే గ్రామీణ బంద్‌లో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బంటు దాసు, బుడితి అప్పలనాయుడు, బొత్స నర్సింగరావు, పాలక రంజిత్‌ కుమార్‌, పి.సంగం ,సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. గుమ్మలక్ష్మీపురం: ఈనెల 16న దేశవ్యాప్త కార్మికుల సమ్మె – గ్రామీణ భారత్‌ బంద్‌ జయప్రదం చేయాలని కోరుతూ ఆదివాసీ గిరిజన సంఘం నాయకులు గ్రామాల్లో ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా సోమవారం లుంబేసు, గౌడుగూడ గ్రామాల్లో కరపత్రాలు పంచుతూ ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో ఆదివాసీ గిరిజన సంఘం నాయకులు మండంగి సన్యాసిరావు, బిడ్డిక రమేష్‌ ఉన్నారు.

➡️