డయల్‌ యువర్‌ డిఎహెచ్‌ఒకు 23 వినతులు

Nov 27,2024 21:29

పార్వతీపురం : డయల్‌ యువర్‌ డిఎహెచ్‌ఒకు 23 వినతులు అందాయని జిల్లా పశు సంవర్థక అధికారి శివ్వాల మన్మథరావు తెలిపారు. కలెక్టర్‌ ఆదేశాల మేరకు బుధవారం ఉదయం 9 గంటల నుంచి డయల్‌ యువర్‌ డిఎహెచ్‌ఒ (జిల్లా పశు సంవర్థక అధికారి) కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 23 మంది రైతులు వారి సమస్యలను తెలియజేశారు. ప్రభుత్వం అందజేసిన టిఎంఆర్‌తో పాల దిగుబడి గణనీయంగా పెరిగిందని, సబ్సిడీతో కూడిన టిఎంఆర్‌, మిశ్రమ దాణాను ఏడాది మొత్తం సరఫరా చేయాలని పలువురు రైతులు కోరారు. గోకులాల షెడ్లు మంజూరు చేయాలని పలువురు రైతులు విన్నవించారు. రైతుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. కార్యక్రమంలో ఎడి కె.ప్రసాదరావు, బి.శ్రీనివాసరావు, బి.చక్రధర్‌ పాల్గొన్నారు.

➡️