కేరళ పర్యటనకు 36 మంది రైతులు

Feb 1,2025 21:12

ప్రజాశక్తి- సీతంపేట : మారిషస్‌ పైనాపిల్‌ పంటపై క్షేత్ర స్థాయిలో అవగాహన కోసం సీతంపేట, భామిని మండలాలకు చెందిన 36 మంది గిరిజన రైతులు శనివారం కేరళ పయణమ య్యారని ఐటిడిఎ పిఒ సి.యశ్వంత్‌ కుమార్‌ రెడ్డి తెలిపారు. రైతులు పయనమయ్యే బస్సును ప్రాజెక్టు ఆయన శనివారం జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీతంపేట, భామిని మండలాల్లో ప్రయోగాత్మకంగా చేపడుతున్న మారిసస్‌ పైనాపిల్‌ పంటపై అవగాహన కల్పించడానికి గిరిజన రైతులను కేరళ తీసుకువెళ్లి అక్కడ పండిస్తున్న మారిషస్‌ పైనాపిల్‌ పంట విధానాలపై గిరిజన రైతులకు అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు. పైనాపిల్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లను చూపించి, ప్రొసెసింగ్‌ విధానాలపై అవగాహన కల్పిస్తామన్నారు. వీటితో పాటు ఇతర హార్టికల్చర్‌కు సంబంధించిన పంటల విధానాలపై క్షేత్రస్థాయి పర్యటనల ద్వారా అవగాహన కల్పించనున్నట్లు ఈ సందర్భంగా పిఒ తెలిపారు. రైతులతోపాటు పిహెచ్‌ఒ వెంకట గణేష్‌, హెచ్‌ఒ జయశ్రీ, హార్టికల్చర్‌ అసిస్టెంట్లు దివాకర్‌, కావ్య తదితరులు వెళ్లారు.

➡️