జనరేటర్‌లో మంటలు.. తప్పిన పెను ప్రమాదం

Jan 16,2025 20:32

 ప్రజాశక్తి – కురుపాం: జనరేటర్‌లో మంటలు రేగి పెను ప్రమాదం తప్పింది. ఈ సంఘటన గురువారం ఉదయం స్థానిక ఎస్‌ఎన్సీయూ ఆరోగ్య కేంద్రంలో చోటుచేసుకుంది. స్థానికులు అందించిన సమాచారం ప్రకారం ఆరోగ్య కేంద్రంలో వినియోగించే జనరేటర్‌ లోపల నుంచి పూర్తిగా మంటలు చెలరేగి దట్టమైన పొగ కమ్ముకుంది. వెంటనే స్పందించి మంటలను అదుపు చేశారు. దీంతో ఎటువంటి ప్రమాదం జరగలేదని, పసిపిల్లలకు వైద్యం చేసే ఎస్‌ఎన్సీయూ’ కేంద్రాల్లో ఇలాంటి ప్రమాదం జరగడంతో ఆందోళన చెందు తున్నామని స్థానికులు చెబుతున్నారు. సిబ్బంది, జనరేటర్‌ పనితీరును ఎప్ప టికప్పుడు పరిశీలించి, రక్షణ చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు.

➡️