ప్రజాశక్తి-కొమరాడ : కొమరాడ మండలంలో గుమడ గ్రామ సమీపంలో పశువులు తరలిస్తున్న వ్యక్తిని విశాఖపట్నం నుంచి రాయగడ వైపు వెళ్తున్న లారీ ఢీకొట్టగా గుమడ గ్రామానికి చెందిన యువకుడు దేవుపల్లి భాస్కరరావు (28) అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో ఆగ్రహానికి గురైన గ్రామస్తులు, కుటుంబ సభ్యులు అంతర్రాష్ట్ర రహదారిపై నిరసన తెలిపే లారీ భారీ వాహనాలను రాకపోకలు నిలుపుదల చేయాలని బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ ధర్నా చేపట్టారు.