ప్రజాశక్తి – సీతంపేట : అడవిని సంరక్షించుకోవాలని, ప్రతి ఒక్కరూ ఒక మొక్కలు నాటండి దానివల్ల అడవి సంపద పెరుగుతుంది. వన్యప్రాణులు సంపద పెరుగుతాయి. వాతావరణం సముతుల్యంగా ఉంటుందని ప్రభుత్వాలు అధికారులు పదేపదే సార్లు చెబుతున్నప్పటికీ కలప అక్రమార్కులు ఆ సూక్తులు పెడచెవిని పెడుతున్నారు.. సీతంపేట ఏజెన్సీ కలప స్మగ్లర్లకు అడ్డగా మారింది. రాత్రీ, పగలు అన్న తేడాలేకుండా అన్ని వేళల్లో యథేచ్ఛగా ట్రాక్టర్లు, పికప్ వ్యాన్ల ద్వారా కలపను అక్రమంగా తరలిస్తున్నారు. ఏజెన్సీలో టేకు దుంగలు, మద్దిస, పనస, మామిడి తదితర కల్పవృక్షాలకు ప్రసిద్ధి. ఏజెన్సీలో పూతికవలస మర్రిపాడు ధోనుబాయి, పొల్ల, శంభాం, కడగండి తదితర ప్రాంతాల నుంచి కర్రల మిల్లులకు కలప తరలిపోతుంది. దీనికి సంబంధించిన అధికారులు మాత్రం చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏజెన్సీలో ఉన్న కలపకు ఎక్కువగా సేవ ఉంటుందని గృహాలకు, ఫర్నీచర్‌కు ఇక్కడ కలప వాడ్డానికి మైదాన ప్రాంతంలో మంచి డిమాండు ఉంది. అయితే గతంలో హుదూద్, తిత్లీ తుఫాన్‌లో అదే అలుసుగా తీసుకొని నేలకొరిగిన కలప కన్నా కలప అధికంగా తీసుకెళ్లినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ సంక్రాంతి సీజన్‌లో అధికారులు, ప్రజలు బిజీబిజీగా ఉంటే దాన్ని ఆసరాగా తీసుకొని కలప స్మగ్లర్లు అలుసుగా తీసుకొని వాహనాల్లో అక్రమ కలప రవాణా చేస్తారు. కొత్తూరు, ఆముదాలవలస, రాజాం, పాలకొండ కర్రల మిల్లులకు వాహనాల ద్వారా కలప రాత్రి వేళల్లో తరలిపోతుంది. కలప స్మగ్లర్లకు వర్షాకాలం చలికాలం అనువుగా ఉంటుంది. అందుకే ఈ కాలంలో మరింత ఎక్కువగా కలప రవాణా చేయడానికి సన్నాహాలు చేస్తారు.
