అంబేద్కర్‌ ఆశయాలను ఆదర్శంగా తీసుకోవాలి

Apr 14,2025 21:44

ప్రజాశక్తి – పార్వతీపురం టౌన్‌: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బి.ఆర్‌ అంబేద్కర్‌ ఆశయాలను ఆదర్శంగా తీసుకోవాలని రెండవ అదనపు జిల్లా జడ్జి ఎస్‌ దామోదర రావు అన్నారు. అంబేద్కర్‌ 134 జయంతి సందర్భంగా సోమవారం స్థానిక కోర్టులో అంబేద్కర్‌ చిత్ర పటానికి సోమవారం పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గణతంత్ర, ప్రజాస్వామిక దేశంగా మనదేశాన్ని తీర్చిదిద్దడంలో డాక్టర్‌ అంబేద్కర్‌ కృషి ఎనలేనిదని పేర్కొన్నారు. దేశానికి అంబేద్కర్‌ చేసిన సేవలను కొనియాడారు. అంబేడ్కర్‌ ఆశయ సాధనకు ప్రతిఒక్కరూ కలిసికట్టుగా ముందుకు సాగాలని చెప్పారు. పార్వతీపురం రూరల్‌ : అణగారిన వర్గాలకు ఆశాజ్యోతి, భారత రాజ్యాంగ రచన ద్వారా దేశ ప్రజలకు దిక్సూచి భారత్‌ రత్న డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ అని జిల్లా ఎస్పీ ఎస్‌ వి మాధవ్‌ రెడ్డి అన్నారు . బాబా సాహెబ్‌ జయంతి సందర్భంగా జిల్లా పోలీస్‌ కార్యాలయంలో ఆయన జిల్లా పోలీస్‌ అధికారులు, సిబ్బందితో కలిసి ఆ మహనీయుని చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. కార్యక్రమంలో ఎఆర్‌ డిఎస్పి థామస్‌ రెడ్డి, డిసిఆర్‌బి ఇన్‌స్పెక్టర్‌ ఆదాం, స్పెషల్‌ బ్రాంచి ఇన్‌స్పెక్టర్‌ రమేష్‌, ఎఆర్‌ ఆర్‌ఐలు నాయుడు, రాంబాబు, ఆర్‌ఎస్‌ఐ లు, ఎస్‌ఐలు, ఎస్బీ, డిసిఆర్బి, ఎఆర్‌ అధికారులు, సిబ్బంది, స్పెషల్‌ పార్టీ సిబ్బంది పాల్గొన్నారు.కురుపాం : బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్‌ బి.ఆర్‌ అంబేద్కర్‌ అని మాజీ ఎంపీ వైరిచర్ల ప్రదీప్‌చంద్రదేవ్‌, ఎమ్మెల్యే తోయిక జగదీశ్వరి అన్నారు. అంబేద్కర్‌ జయంతి సందర్భంగా కురుపాంలోని గాంధీ నగర్‌ జంక్షన్‌ వద్ద గల అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళ్లు అర్పించారు. కార్యక్రమంలో ఎఎంసి చైర్మన్‌ కడ్రక కళావతి, మండల కన్వీనర్‌ కెవి కొండయ్య, ఎఎంసి మాజీ చైర్మన్‌ కోలా రంజిత్‌ కుమార్‌, కూటమి నాయకులు మంతిని త్రిపురనాథ్‌, ఎస్‌.గోవింద, చంటి, అజిత్‌ తదితరులు పాల్గొన్నారు.వీరఘట్టం : మండల కేంద్రంతో పాటు చలివేంద్రి, కత్తుల కవిటి, తూడి, నీలానగరం, తలవరం, తెట్టంగి, నడుకూరు, చిట్టపూడివలస, హుస్సేన్‌పురం, పివిఆర్‌ పురం, రేగులపాడు, ఎం.రాజపురం తదితర గ్రామాల్లో డాక్టర్‌ బి.ఆర్‌ అంబేద్కర్‌ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కత్తులకవిటి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల ఆవరణలో గల అంబేద్కర్‌ విగ్రహానికి. జడ్పిటిసి జంపు కన్నతల్లి- ఉమామహేశ్వరరావు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో యువత, పాల్గొన్నారు.పాలకొండ : మండలంలో పలుచోట్ల అంబేద్కర్‌ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వెలగవాడ వద్ద గల అంబేద్కర్‌ విగ్రహాన్ని ఎమ్మెల్యే జయకృష్ణ ఆవిష్కరించారు. యాలం జంక్షన్‌ వద్ద అంబేద్కర్‌ విగ్రహానికి డిఎస్‌పి ఎం.రాంబాబు, సిఐ ఎం.చంద్రమౌళి, ఎస్సై ప్రయోగమూర్తి పూలుమాలు వేసిన నివాళులర్పించారు. స్థానిక శాఖ గ్రంథాలయంలో అంబేద్కర్‌ చిత్రపటానికి దళిత సంఘాల ఉత్తరాంధ్ర ఉద్యోగుల సంఘం నేత మూతులపాటి భరతభూషణ్‌, పార్వతీపురం కాంగ్రెస్‌ ఇన్‌ఛార్జి బత్తిని మోహన్‌రావు, సర్పంచులు తిర్లంగి ఉపేంద్ర, రాయి రామకృష,్ణ ఆనందరావు, శంకర్రావు, రవి, శాఖా గ్రంథాల అధికారి బి.గణేష్‌బాబు చిత్రపటానికి పూలుమాలు వేసిన వాళ్ళు అర్పించారు టిడిపి కార్యాలయంలో మండల టిడిపి మాజీ అధ్యక్షులు గుమ్మడి సింహాద్రి, నాయకులు చొంగ శివానంద్‌, సర్వేరావు, మజ్జి జయశంకర్‌ అంబేద్కర్‌ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. స్థానిక రెల్లివీధిలో అంబేద్కర్‌ విగ్రహానికి రెల్లి సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు మజ్జి బాబ్జీ, రెండో వార్డ్‌ కౌన్సిలర్‌ ఆకుల కుమార్‌, బేవర ప్రసాద్‌, పిన్నింటి బాలరాజు పూలమాలు ఘనంగా నివాళులర్పించారు. నక్కల పేట ప్రాంతంలో వైసిపి పట్టణ అధ్యక్షులు వెలమల మన్మధరావు, కడగల రమణ, కాంతారావు, కె.విజరు కుమార్‌, దుంపల చిన్ని, మధు అంబేద్కర్‌ చిత్రపటానికి పూలు వేసి ఘనంగా నివాళులర్పించారు.పార్వతీపురం టౌన్‌ : మాజీ ఎమ్మెల్యే జోగారావు సారధ్యంలో నియోజకవర్గ కేంద్రంలో అంబేద్కర్‌ జయంతి వేడుకలు నియోజకవర్గ వైసిపి ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలతో ఘనంగా నిర్వహించారు. ముందుగా ప్రధాన రహదారి 13వ వార్డు ఇందిరా కాలనీ ఎదురుగా ఉన్న అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళ్లు అర్పించారు. కార్యక్రమంలో మూడు మండలాలు, మున్సిపాల్టీల వైసిపి ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, సర్పంచులు, ఎంపిటిసి సభ్యులు పాల్గొన్నారు.సాలూరు: రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ జయంతి సందర్భంగా పట్టణంలోని 25వార్డు పరిధిలో బంగారమ్మ పేట, పిఎన్‌ బొడ్డు వలసల్లో అంబేద్కర్‌ విగ్రహాలకు మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర పూలమాలలు వేసి నివాళులర్పించారు. కౌన్సిలర్‌ సింగారపు ఈశ్వరరావు, వైసిపి నాయకులు టి.బలరాం ఆధ్వర్యాన నిర్వహించిన కార్యక్రమంలో పట్టణ వైసిపి అధ్యక్షులు వంగపండు అప్పలనాయుడు, జెసిఎస్‌ కన్వీనర్‌ గిరిరఘు, మాజీ కౌన్సిలర్‌ ఎం.అప్పారావు, నాయకులు కస్తూరి రామకృష్ణ, పిరిడి రామకృష్ణ పాల్గొన్నారు.పార్వతీపురం: ఆదివాసీ టీచర్స్‌ అసోసియేషన్‌ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు అమర్‌ నాథ్‌ అంబేద్కర్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళ్లు అర్పించారు. అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షులు పైడి రాజు, ప్రధాన కార్యదర్శి తాడంగి సత్యనారాయణ మాట్లాడారు. కార్యక్రమంలో సంఘం విజయనగరం జిల్లా అధ్యక్షులు తవిటన్న దొర, ప్రధాన కార్యదర్శి టి.సత్యనారాయణ, ఆదివాసీ కవి ఎమ్‌.జగదీష్‌, జిల్లా, మండల సంఘ నాయకులు పాల్గొన్నారు.సీతానగరం : స్థానిక తహశీల్దార్‌ కార్యాలయం ఎదురుగా ఉన్న అంబేద్కర్‌ విగ్రహానికి పెదభోగిలి సర్పంచ్‌ జె.తేరిజమ్మ, ఎంపిడిఒ పి త్రివిక్రమారావు, ఆర్‌ఐ ఎన్‌.శ్రీనివాసరావు పూలుమాలల వేసి నివాళులర్పించారు. కాశీపేటలో అంబేద్కర్‌ విగ్రహానికి మాజీ సర్పంచ్‌ తేలు చంద్రశేఖరు, మాజీ జెడ్పిటిసి టి.వెంకటనాయుడు, టిడిపి నాయకులు తేలు తిరుపతిరావు పూలమాలు వేసి నివాళులర్పించారు. లచ్చిపేటలో సర్పంచ్‌ సిహెచ్‌ కృష్ణ, ఎంపిటిసి ఎ.సింహాచలం, జెడ్‌పిటిసి ఎం.బాబ్జీ అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో వివిధ గ్రామాల పెద్దలు పాల్గొన్నారు.సీతంపేట : పాలకొండ నియోజకవర్గ టిడిపి ఇన్‌ఛార్జి పడాల భూదేవి ఆధ్వర్యంలో బిఆర్‌ అంబేద్కర్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఎఎంసి డైరెక్టర్‌ సవర మంగయ్య, మాజీ ఎంపిపి సవర కుంపి, సవర కూర్మారావు, సవర సిమ్మయ్య, తదితరులు పాల్గొన్నారు.గుమ్మలక్ష్మీపురం : గుమ్మలక్ష్మీపురంలో అంబేద్కర్‌ విగ్రహానికిఎమ్మెల్యే తోయక జగదీశ్వరి పూలమాలలు వేసి నివాళ్లు అర్పించారు. కార్యక్రమంలో ఆర్‌డబ్ల్యుఎస్‌ డిఇ నాగేశ్వరరావు, కురుపాం మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ కడ్రక కళావతి, ఎస్‌సి, ఎస్‌టి ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షులు పాలక దేవానంద్‌, టిడిపి నాయకులు సొంటేన రాజేష్‌, కొనిస మన్మధరావు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. తహశీల్దార్‌ కార్యాలయంలో తహశీల్దార్‌ ఎన్‌.శేఖర్‌ అంబేద్కర్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో కార్యాలయం సిబ్బంది, విఆర్‌ఒలు పాల్గొన్నారు.పుస్తకావిష్కరణ: స్థానిక మండల పరిషత్‌ కార్యాలయంలో అంబేద్కర్‌ ఏం చేశారనే ఆర్‌డబ్ల్యుఎస్‌ డిఇ నాగేశ్వరరావు పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ వికాస పరిషత్‌ నాయకులు పత్తిక లక్ష్మయ్య, కాంగ్రెసు కోఆర్డినేటర్‌ అడ్డంకుల చిన్నారావు, పాల్గొన్నారు.పాచిపెంట: స్థానిక మండల పరిషత్‌ కార్యాలయం వద్ద ఉన్న అంబేద్కర్‌ విగ్రహానికి ఎంపిపి బి.ప్రమీల పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపిడిఒ బివిజె పాత్రో, పి వీరమనాయుడు, వైస్‌ ఎంపిపి కొల్లి రవీంద్ర, ఎంపిటిసి దండి ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు.ఐటిడిఎలో అంబేద్కర్‌ జయంతిసీతంపేట: స్థానిక ఐటిడిఎ ప్రాంగణంలో గల అంబేద్కర్‌ విగ్రహానికి ఎఒ సునీల్‌ ఇతర అధికారులు పూలమాలవేసి నివాళులర్పించారు. మల్లి ఆశ్రమ ఉన్నత పాఠశాలలో అంబేద్కర్‌ విగ్రహానికి ప్రధానోపాధ్యాయులు పాలక నారాయడు పూలమాలవేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో అకౌంట్‌ మేనేజర్‌ ఎఎంఒ పి కోటి బాబు తదితరులు పాల్గొన్నారు.కొమరాడ: మండలంలోని స్వామినాయుడువలస ఎస్‌సి వీధిలో అంబేద్కర్‌ విగ్రహానికి గ్రామస్తులు పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ప్రభుత్వ కార్యాలయాలు, గ్రామ సచివాలయ భవనాల్లో ఉద్యోగులు సమక్షంలో అంబేద్కర్‌ చిత్రపటానికి పూలమాలు వేసి ఘనంగా నివాళులర్పించారు.రాజ్యాంగ పరిరక్షణకు ప్రజలంతా ఐక్యంగా పోరాడాలిపార్వతీపురంరూరల్‌: దేశంలో అడుగడుగునా, ఆణువణునా రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతుందని ఈ తరుణంలో రాజ్యాంగ పరిరక్షణకు దేశ ప్రజలంతా ఐక్యంగా పోరాటం చేయాలని జన విజ్ఞాన వేదిక జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ ఎంవిఆర్‌ కృష్ణాజీ పిలుపునిచ్చారు. అంబేద్కర్‌ జయంతి సభ సోమవారం పార్వతీపురం గిరిజన సామాజిక భవన్‌లో గిరిజన సంక్షేమ సంఘం ఉత్తరాంధ్ర ప్రధాన కార్యదర్శి పాలక రంజిత్‌ కుమార్‌ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సభకు ముఖ్యఅతిథిగా పాల్గొన్న కృష్టాజీ మాట్లాడుతూ సామాజిక హక్కుల రక్షణ, పౌర హక్కుల కోసం నినదించాలని అన్నారు. కార్యక్రమంలో గిరిజన సంక్షేమ సంఘం నాయకులు తాడంగి సాయిబాబు, ఊర్లక నాగార్జున, కొండగొర్రి చిన్నారావు, గణేష్‌, టిఎస్‌ఎఫ్‌ నాయకులు పాలవలస భగవాన్‌, చెరువుల సంరక్షణ సమితి నాయకులు వంగలదాలి నాయుడు, సిపిఐ లిబరేషన్‌ నాయకులు పి.సంఘం, ఎఐఎస్‌ఎఫ్‌ జిల్లా కార్యదర్శి బి. రవికుమార్‌, జెవివి నాయకులు చంద్రమౌళి, సామజిక చైతన్య వేదిక నాయకులు సంతోష్‌ కుమార్‌, ఆమ్‌ ఆద్మీ నాయకులు నయీమ్‌, తదితరులు పాల్గొన్నారు.

➡️