ఏకతాటిపై నడిపించే ఘనత అంబేద్కర్‌దే : కలెక్టర్‌

Apr 14,2025 21:25

పార్వతీపురం: దేశం ఏకతాటిపై నడుస్తునడానికి కారణం అంబేద్కర్‌ దూర దృష్టేనని కలెక్టర్‌ ఎ.శ్యామ్‌ ప్రసాద్‌ అన్నారు. డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ 134వ జయంతి కార్యక్రమం సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కలెక్టర్టకేట్‌లో ఘనంగా జరిగింది. ముందుగా బి ఆర్‌ అంబేద్కర్‌ విగ్రహానికి కలెక్టర్‌ పూలమాలలు వేసి ఘనంగా నివాళ్లు అర్పించారు. ఈ సందర్భంగా అంబేద్కర్‌ జీవిత చరిత్రపై సమాచార పౌర సంబంధాల శాఖ ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్‌ను తిలకించారు. అనంతరం జరిగిన సమావేశంలో కలెక్టర్‌ మాట్లాడుతూ డాక్టర్‌ అంబేద్కర్‌ తాత్విక చింతన దేశాన్ని నడిపిస్తుందన్నారు. ఇందులో ముఖ్యంగా విద్య అనే ఆయుధం ఉపయోగపడిందని అన్నారు. ఏప్రిల్‌లో ముగ్గురు మహనీయుల జయంతి జరుపుకున్నామని, వీరు సమాజానికి ఒక గొప్ప దిశానిర్దేశం చేసిన మహానుభావులను అన్నారు. జిల్లాలో ఎస్‌సి, ఎస్‌టి జనాభా ఎక్కువ ఉందని అంబేద్కర్‌ స్పూర్తితో మంచి విజయాలు దిశగా అడుగులు వేయాలని అన్నారు. ఇంటర్‌ ఫలితాల్లో సాంఘీక సంక్షేమ వసతి గహాల విద్యార్థులు 71 శాతం ఉత్తీర్ణత శాతం సాధించారన్నారు. పదవ తరగతిలో కూడా మంచి ఫలితాలు సాధిస్తామని అశాభావం వ్యక్తం చేశారు. సాంఘిక సంక్షేమ వసతి గృహాలను రూ.2కోట్లుతో మరమ్మతులు, అదనపు వసతులు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఎస్‌సి కార్పొరేషన్‌ ద్వారా రూ.11.53 కోట్లతో ఎస్‌సి లబ్ధిదారులకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని కలెక్టర్‌ తెలిపారు. అంబేద్కర్‌ జయంతి రోజు నుండే ఆన్‌లైన్‌లో దరఖాస్తులు సమర్పించాలని ఆయన చెప్పారు. డిఆర్‌ఒ కె.హేమలత మాట్లాడుతూ గొప్ప ఆదర్శనీయులని, ఆయన స్పూర్తితో అంతర్జాతీయంగా పేరు సాధించే దిశగా విద్యార్థులు అడుగులు వేయాలని పిలుపునిచ్చారు. అనంతరం పార్వతీపురం సాంఘిక సంక్షేమ వసతి గృహం -1కు చెందిన గాయత్రి కళాశాల డిగ్రీ రెండో సంవత్సరం విద్యార్థి పి రిమా, బందలుప్పి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల విద్యార్థిని బి.సుస్మిత అంబేద్కర్‌ గొప్పదనంపై ప్రసంగించారు. గరుగుబిల్లి, కొమరాడ, పార్వతీపురం ప్రభుత్వ సాంఘిక సంక్షేమ వసతి గృహ విద్యార్థులు సాంస్కతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా భారత రాజ్యాంగ పీఠికను అందరూ పటించారు. విభిన్న ప్రతిభావంతుల శాఖ సీతానగరం మండలం పెదబొండపల్లికి చెందిన మూకళ్ళ నిఖిల్‌కు రూ.39 వేల విలువ చేసే లాప్‌ టాప్‌ను, పాలకొండ మండలం తుమరాడకు చెందిన బొంతు శిరీషకు రూ.13 వేలు విలువ చేసే టచ్‌ ఫోన్‌ను అందజేశారు. ఎస్‌సి, ఎస్‌టి రైతులకు రాయితీపై రూ.4.52 లక్షల విలువ గల 15 వ్యవసాయ పవర్‌ వీడర్లను 15 మంది లబ్ధిదారులకు అందజేశారు. ఐదుగురు మహిళా లబ్ధిదారులకు 30 రకాల (పి యం డి ఎస్‌) విత్తనాల కిట్‌ బ్యాగ్‌లను పంపిణీ చేశారు. డిఆర్‌డిఎ ఆధ్వర్యంలో 12,785 మంది లబ్ధిదారులకు బ్యాంకు లింకేజీ, స్త్రీ నిధి, ఉన్నతి, సిఐఎఫ్‌ కింద రూ.74.26 లక్షలు మంజూరు చేస్తూ ఉత్తర్వులను అందజేశారు. చవితి మీనాక్షికి మంజూరు చేసిన రూ.50 వేల విలువగల గొర్రెల యూనిట్‌, ఏనుగుల వనితకు పిఎం ఏజెవై పథకం కింద రూ.2 లక్షల విలువ గల ఫోటో స్టూడియో యూనిట్‌ మంజూరు ఉత్తర్వులు కలెక్టర్‌ అందజేశారు. వసతి గహాలకు పరుపులను అందించారు. కార్యక్రమంలో జిల్లా ఆర్‌.డబ్ల్యు.ఎస్‌ ఇంజినీరింగ్‌ అధికారి ఓ.ప్రభాకర రావు, జిల్లా పశుసంవర్ధక అధికారి ఎస్‌ మన్మథ రావు, జిల్లా వ్యవసాయ అధికారి కె.రాబర్ట్‌ పాల్‌, జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి ఎం డి గయాజుద్దీన్‌, వెలుగు ఎపిడి వై సత్యం నాయుడు, డిప్యూటీ డిఎంహెచ్‌ఒ డాక్టర్‌ టి.జగన్‌ మోహన్‌రావు, జూనియర్‌ కళాశాల ఉపన్యాసకులు ఎ.రాజు, జిల్లా బిసి సంక్షేమ అధికారి అప్పన్న, ఎంఆర్పిఎస్‌ అధ్యక్షులు గొడబ ప్రభాకర రావు, కార్యక్రమంలో ఎస్‌సి, ఎస్‌టి ఉపాధ్యాయ సంఘం అధ్యక్షులు సామల సింహాచలం తదితరులు పాల్గొన్నారు.ఐటిడిఎలో… స్థానిక ఐటిడిఎ కార్యాలయంలో అంబేద్కర్‌ చిత్ర పటానికి గిరిజన సంక్షేమ శాఖ ఉప సంచాలకులు ఆర్‌.కృష్ణవేణి, పిఎఒ శ్రీనివాస్‌, డ్వామా ఎపిడి సురేష్‌ నాయుడు పూలమాల వేసి నివాళ్లు అర్పించారు.

➡️