సాలూరు: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్‌ను మాటమాటికీ స్మరించరాదంటూ కేంద్ర హోం మంత్రి అమిత్‌షా చేసిన వ్యాఖ్యలకు ఆయన క్షమాపణ చెప్పాలని నియోజకవర్గ కాంగ్రెస్ సమన్వయకర్త గేదెల రామకృష్ణ డిమాండ్ చేశారు. మండలంలోని దత్తివలసలో గురువారం కాంగ్రెస్ కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర మంత్రి అమిత్‌షా రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సమావేశంలో తీర్మానం చేశారు. మండల పార్టీ అధ్యక్షులు ఒంటి బుచ్చయ్య అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మంత్రి పదవికి రాజీనామా చేసేంత వరకు దశలవారీ ఆందోళన కార్యక్రమాలుఅమిత్‌షా రాజీనామా చేయాలి సాలూరుభారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్‌ను మాటమాటికీ స్మరించరాదంటూ కేంద్ర హోం మంత్రి అమిత్‌షా చేసిన వ్యాఖ్యలకు ఆయన క్షమాపణ చెప్పాలని నియోజకవర్గ కాంగ్రెస్ సమన్వయకర్త గేదెల రామకృష్ణ డిమాండ్ చేశారు. మండలంలోని దత్తివలసలో గురువారం కాంగ్రెస్ కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర మంత్రి అమిత్‌షా రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సమావేశంలో తీర్మానం చేశారు. మండల పార్టీ అధ్యక్షులు ఒంటి బుచ్చయ్య అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మంత్రి పదవికి రాజీనామా చేసేంత వరకు దశలవారీ ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని పిసిసి పిలుపు నిచ్చిందని చెప్పారు. శుక్రవారం పిసిసి అధ్యక్షులు వైఎస్ షర్మిల ఆధ్వర్యాన విశాఖలో నిర్వహించనున్న ధర్నాకు కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు హాజరు కావాలని కోరారు. అనంతరం పిఎన్ బొడ్డవలసలో గల అంబేద్కర్ విగ్రహం పాదాల చెంత తీర్మానం కాపీని పెట్టి నిరసన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకుడు ద్వారపురెడ్డి పుండరీకాక్ష నాయుడు, పట్టణ అధ్యక్షులు సిగడాపు బంగారయ్య పాల్గొన్నారు. పార్వతీపురంరూరల్ : మండలంలోని నర్సిపురంలో పార్వతీపురం నియోజకవర్గ సమన్వయకర్త బత్తిన మోహన్ ఆధ్వర్యంలో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ మేరకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. పార్లమెంట్ సాక్షిగా అంబేద్కర్‌ను అవమానించిన అమిత్‌షా వెంటనే మంత్రి పదవికి రాజీనామా చేయాలని, మంత్రి పదవి నుంచి అమిత్‌షాను తొలగించాలని కోరారు. ఈ సందర్భంగా నర్సిపురం గ్రామపంచాయతీ సర్పంచ్ బంగారమ్మకు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో నియోజకవర్గం కాంగ్రెస్ కార్యకర్తలు, మండల అధ్యక్షులు తేళ్ల గౌరీ శంకర్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు సాయి శ్రీనివాస్, జిల్లా కాంగ్రెస్ నాయకులు కోలా కిరణ్, మండల యూత్ కాంగ్రెస్ నాయకులు చింతాడ దిలీప్, మరియు మహిళా కార్యకర్తలు పాల్గొన్నారు. చేపట్టాలని పిసిసి పిలుపు నిచ్చిందని చెప్పారు. శుక్రవారం పిసిసి అధ్యక్షులు వైఎస్ షర్మిల ఆధ్వర్యాన విశాఖలో నిర్వహించనున్న ధర్నాకు కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు హాజరు కావాలని కోరారు. అనంతరం పిఎన్ బొడ్డవలసలో గల అంబేద్కర్ విగ్రహం పాదాల చెంత తీర్మానం కాపీని పెట్టి నిరసన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకుడు ద్వారపురెడ్డి పుండరీకాక్ష నాయుడు, పట్టణ అధ్యక్షులు సిగడాపు బంగారయ్య పాల్గొన్నారు. పార్వతీపురంరూరల్ : మండలంలోని నర్సిపురంలో పార్వతీపురం నియోజకవర్గ సమన్వయకర్త బత్తిన మోహన్ ఆధ్వర్యంలో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ మేరకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. పార్లమెంట్ సాక్షిగా అంబేద్కర్‌ను అవమానించిన అమిత్‌షా వెంటనే మంత్రి పదవికి రాజీనామా చేయాలని, మంత్రి పదవి నుంచి అమిత్‌షాను తొలగించాలని కోరారు. ఈ సందర్భంగా నర్సిపురం గ్రామపంచాయతీ సర్పంచ్ బంగారమ్మకు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో నియోజకవర్గం కాంగ్రెస్ కార్యకర్తలు, మండల అధ్యక్షులు తేళ్ల గౌరీ శంకర్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు సాయి శ్రీనివాస్, జిల్లా కాంగ్రెస్ నాయకులు కోలా కిరణ్, మండల యూత్ కాంగ్రెస్ నాయకులు చింతాడ దిలీప్, మరియు మహిళా కార్యకర్తలు పాల్గొన్నారు.