ఇంటి తలుపులు వేసి… యజమానులపై దాడి

Oct 1,2024 21:29

ప్రజాశక్తి – మక్కువ : అచ్చం సినిమాలో చూపించి నట్లుగానే కొంత మంది వ్యక్తులు ఇంటిలో ప్రవేశించి తలుపులు మూసి ఇంటి యజమా నులపై దాడి చేసి ఇంట్లో వస్తువులన్నీ ధ్వంసం చేసిన ఘటన మండలంలో సంచలనం రేపింది. ఏం జరిగిందో తేరుకునే లోపే వచ్చిన దుండగులు హెచ్చరిస్తూ కారులో పరారైన ఘటన మండలంఓలని చెముడులోని మంగళవారం సాయంత్రం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారంమండలంలోని చెముడులో కర్ర వీధిలో గొట్టాపు మనోహర్‌, కృష్ణ అన్నదమ్ములు నివాసం ఉంటున్నారు. మనోహర్‌ పెద్ద కుమారుడికి వివాహం కూడా నిశ్చయం కావడంతో ఆ పనుల్లో వారు నిమగమై ఉన్నారు. మంగళవారం సాయంత్రం గ్రామంలోకి గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి మనోహర్‌ ఇంట్లో చొరబడి ఇంటి తలుపులు మూసి దొరికిన వారిని దొరికినట్లుగా దాడి చేసి బీభత్సం సష్టిం చ్చినట్లు తెలిసింది. ఇంట్లో ఉన్న గృహోపకరణాలను సైతం విడిచిపెట్టకుండా ధ్వంసం చేసినట్లు తెలిసింది. దాడిలో మనోహర,్‌ కృష్ణ గాయపడ్డారు. వెంటనే వీరిని శంబర ప్రాథమిక ఆరోగ్య కేంద్రంకు వెళ్లగా వారికి వైద్య సిబ్బంది ప్రథమ చికిత్స చేసి సాలూరు సిహెచ్‌సికి రిఫర్‌ చేసినట్లు తెలిసింది. అయితే స్థానికంగా ఈ దాడి కలకలం రేపింది. ఇప్పటివరకు మండలంలో ఈ తరహా దాడులు జరగడం ఇదే ప్రథమం. దీంతో చెముడు గ్రామంలో భయాందోళనలు నెలకొన్నాయి. తమపై దాడి జరిగిన విషయమై స్థానిక పోలీసులు మనోహర్‌, కృష్ణ మంగళవారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు దర్యాప్తు చేసి నిజానిజాలు తేలాల్సి ఉంది.

➡️