బ్రిడ్జి పనులు పూర్తి చేయాలి

Mar 9,2025 22:01

ప్రజాశక్తి-సీతానగరం:  సువర్ణముఖి నదిపై నూతనంగా నిర్మిస్తున్న బ్రిడ్జి పనులను మే నాటికి పూర్తిచేయాలని ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర అధికారులను ఆదేశించారు. ఆ బ్రిడ్జి పనులను ఆదివారం ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బూర్జ, చిన్న అంకలాం మధ్య బ్రిడ్జి నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని శాసనసభలో ప్రభుత్వాన్ని కోరినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో టిడిపి మండల అధ్యక్షు, కార్యదర్శి పెంట సత్యంనాయుడు, ఆర్‌.వేణుగోపాల్‌ నాయుడు, పెదబాబు, సర్పంచ్‌ జొన్నాడ తెరీజమ్మ, ఉప సర్పంచ్‌ కె.అరవింద్‌ కుమార్‌, మాజీ సర్పంచ్‌ బి.శ్రీనివాసరావు, నాయకులు ఎస్‌.హరి, గోపాలరావు, తెంటు వెంకట అప్పలనాయుడు, పి.నాగభూషణరావు, అప్పారావు తదితరులు పాల్గొన్నారు.

➡️