శాంతి భద్రతల పరిరక్షణలో సిసి కెమెరాలది కీలక పాత్ర : ఎస్‌పి

Apr 12,2025 21:51

పార్వతీపురంరూరల్‌ : నేరాలను అదుపుచేయడంలో, నేరస్థులను కనిపెట్టడంలో, శాంతిభద్రతల పరిరక్షణలో సిసి కెమెరాలు క్రియాశీలక పాత్ర పోషిస్తాయని ఎస్పీ ఎస్‌వి మాధవ్‌ రెడ్డి అన్నారు. శనివారం స్థానిక ఎస్పీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పాచిపెంటకు చెందిన నల్లి షణ్ముఖరావు తన తల్లిదండ్రుల జ్ఞాపకార్ధం నేరాల అదుపునకు సహకరించేందుకు ఎస్పీ కార్యాలయంలో రూ.1.20లక్షలు విలువ చేసే 40 సీసీ కెమెరాలు, దానికి సంబంధించిన డివిఆర్‌లతో పాటు వాటిని అమర్చేందుకు పరికరాలను ఎస్పీకి అందించారు. వీటిని తమ మండలంలో శాంతిభద్రతల నిర్వహణకు ఉపయోగించాలని కోరారు. దాత ప్రయత్నానికి ఎస్పీ అభినందిస్తూ అతడ్ని ఆదర్శంగా తీసుకుని ప్రజల భద్రతలో సిసి కెమెరాలు, రోడ్డు ప్రమాదాల నివారణకు స్టాపర్స్‌(బ్యారికేడర్స్‌) పాత్రను గుర్తించి వాటిని ఏర్పాటు చేసేందుకు ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎఎస్పీ అంకిత సురాన, ఎఆర్‌ డిఎస్పీ థామస్‌ రెడ్డి, ఎస్బీ సిఐ రంగనాధం, డిసిఆర్బి సిఐ ఆదాం, సాలూరు టౌన్‌ సిఐ అప్పలనాయుడు, సాలూరు రూరల్‌ సిఐ రామకృష్ణ, ఎఆర్‌ ఆర్‌ఐలు నాయుడు, రాంబాబు పాచిపెంట ఎస్‌ఐ కె.వెంకట సురేష్‌ పాల్గొన్నారు.

➡️