గిరిజన చట్టాలను కాలరాసేందుకు కేంద్రం కుట్ర

Nov 30,2024 21:13

ప్రజాశక్తి – సీతంపేట: గిరిజన చట్టాలు, హక్కులను కాలరాసేందుకు కేంద్రంలో బిజెపి ప్రభుత్వం కుట్ర పన్నుతోందని సిపిఎం జిల్లా కార్యదర్శి రెడ్డి వేణు విమర్శించారు. మండలంలోని ధారపాడు పంచాయతీ కోసంగిలో మండల మహాసభ శనివారం జరిగింది. ఈ మహాసభనుద్దేశించి ఆయన మాట్లాడారు. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం సూపర్‌ సిక్స్‌ అమలు చేస్తానని ఎన్నికల ముందు హామీ ఇచ్చినా, ఆ సంక్షేమ పథకాలేవీ సక్రమంగా అమలు చేయడంలేదని విమర్శించారు. ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలపై అనేక భారాలు వేసి సామాన్య మానవుడు నడ్డి విరుస్తుందన్నారు. ఇప్పటికే ట్రూ ఆఫ్‌ చార్జీలు పేరిట విద్యుత్‌ ఛార్జీలు పెంచారన్నారు. నిరుద్యోగ సమస్య అధికంగా ఉందన్నారు. ప్రజా సమస్యలపై సిపిఎం ఎల్లవేళలా పోరాడుతుందనిన్నారు. అనంతరం 11మంది సభ్యులతో మండల నూతన కార్యవర్గం ఎన్నికైంది. మండల కార్యదర్శిగా ఆరిక భాస్కరరావు ఎన్నికవ్వగా సభ్యులుగా జీలకర్ర శ్రీరాములు, జీలకర్ర సుందరమ్మ, జీలకర్ర మధుసూదన్‌ రావు, మండంగి లక్ష్మణరావు, మండంగి కాంతారావు, పత్తిక వీరన్న, మండంగి వెంకటేష్‌, బిడ్డిక పరుశురాం, పాలక సాంబయ్య, ఆరిక ధనలక్ష్మి ఎన్నికయ్యారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శివర్గసభ్యులు ఎం.తిరుపతిరావు, కె.గంగునాయుడు, నాయకులు దావాల రమణారావు, పాలక సాంబయ్య, కుమార్‌, అప్పారావు తదితరులు పాల్గొన్నారు.

➡️