బాల్య వివాహాలు అరికట్టాలి

Sep 30,2024 21:16

పార్వతీపురం రూరల్‌ : బాల్యవివాహాలు జరుగకుండా చూడాలని జిల్లా స్త్రీ శిశు సంక్షేమ, సాధికారతా అధికారిణి ఎంఎన్‌ రాణి తెలిపారు. సోమవారం స్థానిక మండల పరిషత్‌ కార్యాలయ సమావేశమందిరంలో బాల్యవివాహాలు, కిశోర వికాసం, వ్యక్తిగత పరిశుభ్రత తదితర అంశాలపై సిడిపిఒలకు, సూపర్‌ వైజర్లకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బాల్యవివాహాల నివారణకు, ప్రతి బాలిక బడికి వెళ్లేలా ప్రోత్సహించాలని తెలిపారు. బడి, కాలేజీ మానివేసిన 15- 18 ఏళ్లలోపు బాలికలతో బాలికా సమూహాలు ప్రతి గ్రామంలో ఏర్పాటు చేయాలని తెలిపారు. బాలికా సమూహాల్లో మహిళా పోలీసులు కూడా ఉండాలని, వారితో తరచూ సమావేశాలు నిర్వహించాలని తెలిపారు. వారికి ఆరోగ్యం, వ్యక్తిగత పరిశుభ్రత, బాల్యవివాహాల వల్ల కలిగే అనర్దాలు, బాల్యవివాహాలు నిర్వహిస్తే చట్టపరంగా తీసుకొనే చర్యలు, శిక్షలు గూర్చి తెలియజేయాలని తెలిపారు. కార్యక్రమంలో జిల్లాలో గల ప్రోజెక్టు అధికారులు, సూపర్‌ వైజర్లు, సిబ్బంది పాల్గొన్నారు.

➡️