పాలకొండ : సంక్రాంతి పండుగ దగ్గర పడుతుండడంతో పట్టణంలో స్థానిక నగర పంచాయతీ కమిషనర్ ఎస్.సర్వేశ్వరరావు గురువారం ఉదయం సుడిగాలి పర్యటన చేపట్టారు. పారిశుధ్య నిర్వహణపై దృష్టి పెట్టారు. వేకువజాము నుంచి పర్యటించి పారిశుధ్య పనులపై దృష్టి పెట్టారు. ముందుగా నగర పంచాయతీ కార్యాలయానికి చేరుకొని కార్మికులతో మాట్లాడి పండగ రోజుల్లో పారిశుధ్య పనులు ముమ్మరంగా చేపట్టాలన్నారు. ఇందిరానగర్ కాలనీ, వీవర్స్ కాలనీ ప్రాంతాలను పరిశీలించిన కమిషనర్ రోడ్డుపై చెత్త వేయొద్దని ప్రజలకు సూచించారు.