యూనివర్సిటీని జిల్లాలోనే కొనసాగించాలి : సిపిఎం

Nov 30,2024 21:15

 ప్రజాశక్తి – గుమ్మలక్ష్మీపురం: గిరిజన యూనివ ర్సిటీని తరలించకుండా జిల్లాలోనే నిర్మించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కోలక అవినాష్‌ డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా శనివారం గుమ్మలక్ష్మీ పురంలో గోడపత్రిక లను విడుదల చేశారు. విభజన చట్టంలో పేర్కొన్న విధంగా పార్వతీపురం మన్యం జిల్లాకు కేటాయించిన కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయాన్ని ప్రస్తుతం పనులు కొనసాగుతున్న మెంటాడ మండలం కుంటివలస వద్దనే కొనసాగించి మన్యం జిల్లా అభివద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలని కోరారు. తెలుగుదేశం అధికారంలోకి వచ్చి కొత్తవలస వద్ద గిరిజన యూనివర్సిటీని కొనసాగిస్తామనడంలో అర్ధం లేదని వెనక్కి తీసుకోకపోతే జిల్లా ప్రజలకు తీరని ద్రోహం చేసిన వారవుతారని తెలిపారు. రూ.110 కోట్లు నిధులు అవసరం కాగా, కేవలం నేటికీ రూ.432 కోట్లు మాత్రమే నిధులు కేటాయింపులు జరిగాయని, పనులు త్వరగా జరగపోవడానికి నిధులు కేటాయింపులు కేంద్ర ప్రభుత్వం నుంచి పూర్తిస్థాయిలో లేకపోవడం కూడా కారణమని తెలిపారు. టిడిపి ప్రభుత్వం ప్రస్తుతం ప్రకటించిన నిర్ణయంపై వెంటనే పునరాలోచన చేయాలని, లేకుంటే అన్ని పక్షాలను కలుపుకొని పోరాటం చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఎంపిటిసి సభ్యులు మండంగి రమణ, నాయకులు అడ్డుమహేశ్వరరావు, ఇండియా, గుణేశ్వరరావు ఉన్నారు.

➡️