సీతానగరం: మండలంలోని పలు పాఠశాలలను జిల్లా విద్యాశాఖాధికారి రమజ్యోతి శనివారం పరిశీలించారు. లచ్చయ్యపేటలోని ఎంపిపి పాఠశాల, చిన్నభోగిలిలో ఎంపిపిఎస్, బూర్జ జెడ్‌పి హైస్కూల్‌ను ఆమె తనిఖీ చేశారు. అవుట్ అఫ్ స్కూల్ చిల్డ్రన్ (ఒఎస్‌సి)ను వెంటనే స్కూల్‌లో చేర్పించాలని గతంలో ఆదేశాలు అందజేశామన్నారు. అయితే ఒఎస్‌సి పిల్లలు పాఠశాలకు రెగ్యులర్‌గా హాజరైందీ, లేనిదీ అక్కడ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అంతేకాక ఆ విద్యార్థులతో కలిసి మాట్లాడారు. డిఇఒ వెంట ఎంఇఒలు సూరిదేముడు, ఎం.వెంకటరమణ, ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, సిఆర్‌పిలు పాల్గొన్నారు.
