ప్రజాశక్తి- పార్వతీపురంరూరల్ : పల్లెలను అన్ని విధాలా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పల్లె పండగ కార్యక్రమాన్ని అమలు చేసిందిని స్థానిక ఎమ్మెల్యే విజరు చంద్ర అన్నారు. మండలంలోని ఎం ఆర్ నగరంలో పల్లె పండుగలో భాగంగా మినీ గోకులాన్ని శనివారం ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయంతో పాటు పాడి పరిశ్రమ అభివృద్ధి చెందినప్పుడే అసలైన అభివృద్ధిని అందుకోసం ప్రభుత్వం గోకులాలు పేరుతో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుందన్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను ప్రజలు సద్వినియోగం చేసుకొని ప్రభుత్వ ఆశయం నెరవేర్చేందుకు కృషి చేయాలని ఆయన కోరారు. గత ప్రభుత్వం పాడి పరిశ్రమ అభివృద్ధికి మొండి చేయి చూపించిందని ఎమ్మెల్యే ఆన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక అన్ని వర్గాల వారి అభివృద్ధికి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుందని ఎమ్మెల్యే వివరించారు. కార్యక్రమంలో టిడిపి, జనసేన, బిజెపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.సీతానగరం: మండలంలోని చిన్నరాయుడు పేటలో పల్లెపండగలో భాగంగా మినీ గోకులాన్ని ఎమ్మెల్యే విజయచంద్ర ప్రారంభించారు. కార్యక్రమంలో టిడిపి నాయ కులు రౌతు వేణుగోపాలనాయుడు, పెంట సత్యంనాయుడు, గొట్టాపు అప్పలనాయుడు జనసేన, బిజెపి నాయకులు, తదితరులు కార్యకర్తలు పాల్గొన్నారు.కురుపాం :మినీ గోకులాలతో పాడి పరిశ్రమ అభివద్ధి చెందుతుందని ఎమ్మెల్యే తోయిక జగదీశ్వరి అన్నారు. మండలంలోని కురుపాం, పూతికవలస, తోటగూడ గ్రామాల్లో రైతులు నిర్మించిన మినీగోకులం షెడ్లును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో వ్యవసాయ రంగం తర్వాత అంతటి ప్రాధాన్యత గల రంగం పాడి పరిశ్రమని, పాడి రైతులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు, పాల దిగుబడులు పెంచేందుకు గతంలో టిడిపి ప్రభుత్వం రైతులకు అనేక పథకాలు ప్రవేశపెట్టిందన్నారు. ఈ పథకాలను వైసిపి ప్రభుత్వం రద్దుచేసి పాడి రైతుల నోట్లో మట్టి కొట్టిందన్నారు. షెడ్లు నిర్మించుకున్న రైతులకు ప్రభుత్వం చెల్లించాల్సిన రాయితీలు చెల్లించలేదన్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు మినీ గోకుల షెడ్లు మంజూరు చేసిందని తెలిపారు. కార్యక్రమంలో ఎంపిడిఒ జె.ఉమామహేశ్వరి, ఇఒపిఆర్‌డి జె.రమేష్‌బాబు, ఎపిఒ పి.బావాజీ, వెటర్నరీ డాక్టర్ కె.శైలజ, మేజర్ పంచాయతీ ఇఒ ఎం.ధనుంజయ, మండల టిడిపికన్వీనర్ కెవి కొండయ్య, కూటమి నాయకులు ఎన్.వంశీ, జివి రమణమూర్తి, కర్రి శ్రీను, ఎస్.గోవింద, రామకృష్ణ, సురేష్ , రమేష్ తదితరులు పాల్గొన్నారు.