ప్రజాశక్తి – పార్వతీపురంరూరల్ : మహిళలు చైతన్యవంతులైతే ఆ ప్రాంతం, నియోజకవర్గం, రాష్ట్రం, దేశం అనుకున్న విధంగా అభివృద్ధి చెందుతుందని స్థానిక ఎమ్మెల్యే బోనెల విజరుచంద్ర అన్నారు. మండలంలోని పెదబొండపల్లిలో సాక్షం అంగన్వాడీ కార్యక్రమంలో ఎమ్మెల్యే సోమవారం పాల్గొన్నారు. పిల్లలు పౌష్టికాహార లోపానికి గురి కాకుండా ఉండాలని ప్రభుత్వాలు మంచి పౌష్టికాహారం అందిస్తున్నాయన్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుని చిన్నారులు ఉన్నతంగా ఎదుగుటకు కృషి చేయాలని ఎమ్మెల్యే కోరారు. పెద్దబొండపల్లిలో కల్యాణ మండపం, వెంకటేశ్వర ఆలయ నిర్మాణం కోసం చేసిన ప్రయత్నం విజయ వంతమైందన్నారు. గ్రామస్తులకు ఇచ్చిన మాట నిలబెట్టు కునేందుకు చేసిన ప్రయత్నం ఫలించిందని ఎమ్మెల్యే వివరించారు. పెదబొండపల్లి ఆదర్శ గ్రామంగా మార్చాలన్న ఆలోచనతో ఉన్నట్లు ఎమ్మెల్యే వివరించారు. కార్యక్రమంలో ఐసిడిఎస్ ప్రాజెక్ట్ అధికారి శ్రీనివాసరావు, స్థానిక నాయకులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.గుమ్మలక్ష్మీపురం : సాక్షం అంగన్వాడీ కేంద్రం ద్వారా పౌష్టికాహారం అందించి ఆరోగ్య వంతులుగా ఉంచాలని కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి కోరారు. గుమ్మలక్ష్మీపురంలో మహిళా భివృద్ధి, శిశు సంక్షేమ శాఖ, భద్రగిరి ఐసిడిఎస్ ఆధ్వర్యంలో సాక్షం అంగన్వాడీ కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ బొత్తాడ గౌరీ శంకర్రావు, ఎంపిడిఒ సాల్మన్ రాజ్, ఐసిడిఎస్ పిఒ సుశీలదేవి, వైస్ సర్పంచ్ కొత్తకోట కిషోర్, పంచాయతీ కార్యదర్శి కిషోర్, యూనిట్ ఇన్చార్జ్ మహేశ్వర చిన్న, జడ్పీహెచ్ స్కూల్ చైర్మన్ ఎం.రాజేష్, ట్రైబల్ రైట్స్ ఫోరం రాష్ట్ర అధ్యక్షులు ఆర్.లోవరాజు, ఐసిడిఎస్, సిబ్బంది ఉన్నారు.