నాణ్యమైన భోజనం లేక విద్యార్థు ధర్నా

Feb 9,2025 21:55

సాలూరు : మూడు రోజుల నుండి నాణ్యమైన భోజనం పంపిణీ చేయకపోవడంతో స్థానిక బిసి బాలుర కళాశాల విద్యార్థులు ధర్నా నిర్వహించారు. జావ లాంటి అన్నం పెడుతుండడంతో విద్యార్ధులు రోడ్డెక్కారు. ఆదివారం సాయంత్రం ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యాన విద్యార్ధులు నాణ్యమైన భోజనం పెట్టాలని ధర్నా చేశారు. ఎంత అడిగినా వర్కర్లు, వార్డెన్‌ సమాధానం చెప్పకపోవ డంతో విద్యార్థులు ధర్నాకి దిగారు. అనంతరం ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షులు రాజు మాట్లాడుతూ విద్యార్థులకు సరైన భోజనం అందించకపోవడం దారుణమన్నారు. వెంటనే ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ధర్నా మధ్యలో బిసి సంక్షేమ అధికారితో మాట్లాడగా సోమవారం హాస్టల్‌కు వచ్చి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. దీంతో విద్యార్ధులు ఆందోళన విరమించారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా సహాయ కార్యదర్శి సూర్య, మండల ఉపాధ్యక్షులు సహాయ కార్యదర్శి ధనుంజరు, వెంకీ తదితరులు పాల్గొన్నారు.

➡️