హెచ్‌ఎంపివిపై అవగాహన కల్పించాలి : డిఎంహెచ్‌ఒ

Jan 7,2025 20:52

ప్రజాశక్తి – వీరఘట్టం : హెచ్‌ఎంపివి వైరస్‌పై గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పించాలని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి ఎస్‌.భాస్కరరావు ఆశా కార్యకర్తలను ఆదేశించారు. మంగళవారం మండలంలోని బిటివాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేసిన ఆశా కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. తరచుగా గ్రామాలు సందర్శించి వైరస్‌పై అవగాహన కల్పించాలన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రసవాల సంఖ్య పెంచేందుకు కృషి చేయాలన్నారు. ఆర్‌సిహెచ్‌ నమోదు వేగవంతం చేయాలని, మలేరియా కేసులు ఎక్కువగా నమోదు కాకుండా చూసుకోవాలని తెలిపారు. రక్తహీనతపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ఆశా యాప్‌ మానిటరింగ్‌పై అవగాహన కల్పించారు. ఆర్‌బిఎస్‌కె అండ్‌ ఎన్సిడి ఫీల్డ్‌ సర్వే వేగవంతం చేయాలన్నారు. ఎఫ్‌ఆర్‌సి సమయానికి వేయ్యాలని సిబ్బందిని ఆదేశించారు. అనంతరం రికార్డులను, మందుల స్టోర్‌ రూమ్‌ను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నోడల్‌ అధికారి డాక్టర్‌ ఎం.వినోద్‌ కుమార్‌, స్థానిక పిహెచ్‌సి వైద్యాధికారులు ఎ.మానస, ఎస్‌ నితీసా, సూపర్వైజర్లు, ఎఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలు, పాల్గొన్నారు. కురుపాం : ఆసుపత్రికి వచ్చిన రోగులకు మెరుగైన వైద్య సేవలందించాలని డిప్యూటీ డిఎంహెచ్‌ఒ డాక్టర్‌ కెవిఎస్‌ పద్మావతి అన్నారు. మండలంలోని మొండెంఖల్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించారు. ఆసుపత్రిలో జరుగుతున్న ఆశా డే సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పిల్లలకు పూర్తి రోగ నిరోధక శక్తి, ఇమినేషన్‌ షెడ్యూల్‌, మదర్‌ అండ్‌ చైల్డ్‌ ప్రొటెక్షన్‌ కార్డుల వాడకం, ఆర్‌సిహెచ్‌ పోట్రోల్‌లో గర్భిణుల నమోదు, శిశు మరణాల రేట్లు తగ్గించే విధానం, ఈ ఆశా యాప్‌, సర్వీస్‌ అప్డేట్‌ పర్యవేక్షణ గురించి ఆశావర్కర్లకు అవగాహన కల్పించారు. ప్రతి ఆశా కార్యకర్త తనకు కావాల్సిన అన్ని ప్రెగెన్సీ కిట్లు ఉండేలా చూసుకోవాన్నారు. అనంతరం ఆసుపత్రిలో రికార్డులను పరిశీలించి ప్రతి రోగికి మెరుగైన వైద్య సేవలందించాలని సూచించారు. కార్యక్రమంలో వైద్యాధికారిని డాక్టర్‌ ప్రజ్ఞ, హెల్త్‌ సూపర్వైజర్లు, ఎఎన్‌ఎంలు, హెల్త్‌ అసిస్టెంట్లు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.సీతానగరం: ఆశా డే కార్యక్రమం సందర్భంగా మండలంలోని పెదంకలాం, సీతానగరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యాధికారులు రాధాకాంత్‌, పావని, ఉషారాణి ఆధ్వర్యంలో పలు ఆరోగ్య కార్యక్రమాలపై సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ మేరకు వైద్యాధికారులు సిబ్బందితో మాట్లాడుతూ చిన్న పిల్లలు శ్వాసకోశ వ్యాధులకు చెందిన శాన్స్‌ ప్రోగ్రాం గురించి వివరిస్తూ ఐదేళ్లలోపు పిల్లల ఆరోగ్య సర్వే త్వరితగతిన పూర్తి చేసి సంబంధిత శాన్స్‌ యాప్‌లో వివరాలు నమోదు చేయాలన్నారు. లెప్రసీ సర్వేలో లక్షణాలు గుర్తించిన వారికి వెంటనే చికిత్స ఇచ్చి పర్యవేక్షణ చేయాలని, సర్వే వివరాలు ఎల్‌సిడిసి యాప్‌లో నమోదు చేయాలన్నారు. గర్భిణీల నమోదు ప్రక్రియ మొదటి మూడు నెలల్లో పే జరగాలని, కాన్పుల మధ్య నిర్ణీత సమయం వుండాలని, అందుకు అంతర, పి పి ఐ యు సి డి పద్ధతులపై వారికి అవగాహన కల్పించాలని తెలిపారు. ప్రతి నెలా 9న ప్రభుత్వ ఆసుపత్రుల్లో జరిగే పిఎంఎస్‌ఎంఎ కార్యక్రమానికి గర్భిణీలంతా వచ్చి పూర్తి స్థాయిలో పరీక్షలు, తనిఖీలు చేపట్టేలా చూడాలన్నారు. వీటన్నింటి ద్వారా మాతా, శిశు మరణాలులను నివారించవచ్చని వివరించారు. కదల్లేని స్థితిలో ఉన్న వారి గృహ సందర్శన చేసి పూర్తి స్థాయిలో ఆరోగ్య పర్యవేక్షణ జరపాలని సూచించారు. కార్యక్రమంలో హెల్త్‌సూపర్వైజర్‌, ఎఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. బలిజిపేట : గ్రామీణ స్థాయిలో ఆరోగ్య కార్యక్రమాలను పక్కాగా నిర్వహించాలని వైద్యారోగ్యశాఖ జిల్లా ప్రోగ్రాం అధికారి డాక్టర్‌ టి.జగన్మోహనరావు పేర్కొన్నారు. మండలంలోని అరసాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మంగళవారం నిర్వహించిన ఆశా డే కార్యక్రమంలో ఆయన పాల్గొని ఆరోగ్య కార్యక్రమాలపై సమీక్ష జరిపారు. శిశు ఆరోగ్యానికి సంబంధించిన కార్యక్రమాల్లో టీకాలు ముఖ్యమని, పిల్లలకు వారి వయస్సుకు తగ్గట్టుగా సకాలంలో టీకాలు వేయాలని తెలిపారు. తద్వారా ప్రాణాంతక వ్యాధులైన పోలియో, తట్టు, క్షయ, దనుర్వాతం, న్యుమోనియా, హెపటైటిస్‌, డయేరియా, దృష్టి సమస్యలు, కంఠసర్పి, కోరింత దగ్గు నుంచి పిల్లలకు రక్షణ ఉంటుందన్నారు. టీకా వేసిన, గడువు తేదీలను ఎంసిపి కార్డులో నమోదు తప్పనిసరి అని సూచించారు. గర్భిణుల రిజిస్ట్రేషన్‌ త్వరగా జరగాలని, అందుకు ఇసి (అర్హులైన జంటలు)లను గుర్తించి పర్యవేక్షించే కార్యాచరణ ఆశాలు చేపట్టాలన్నారు. తద్వారా గర్భిణుల్లో హైరిస్క్‌ సమస్యలను ముందస్తుగా అనంతరం కుష్టు వ్యాధి నివారణ కార్యక్రమానికి సంబంధించి బ్యానర్‌ను వైద్య సిబ్బందితో కలిసి పిహెచ్‌సి ఆవరణలో ప్రదర్శించారు. కార్యక్రమంలో వైద్యాధికారి డాక్టర్‌ ఎం.శివగాయిత్రి, డిపిఎంఒ మూర్తి, సూపర్వైజర్లు నారాయణరావు, సత్యవతి వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు తదితరులు అన్నారు.

➡️