బాబు మాటలు నమ్మొద్దు : రాజన్నదొర

Sep 28,2024 21:56

ప్రజాశక్తి – సాలూరురూరల్‌ : భక్తులను అడ్డం పెట్టుకొని తిరుపతి లడ్డూలో పంది, ఆవు కొవ్వులను కలిపి లడ్డూ ప్రసాదం గతంలో తయారు చేశారని సాక్ష్యాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పడం పచ్చి అబద్ధమని, వారు చెప్పే తప్పుడు మాటలను ఎవరూ నమ్మొద్దని మాజీ డిప్యూటీ సిఎం పి.రాజన్నదొర అన్నారు. పాప ప్రాయచిత్త్ర నిమిత్తం స్థానిక కళ్యాణ వెంకటేశ్వర స్వామి మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. తిరుపతి లడ్డూ ప్రసాదంలో ఎటువంటి తప్పు జరగకపోయినా తప్పు జరిగిందని చంద్రబాబు నాయుడు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. తమ ప్రభుత్వం ఉంది కనుక విచారణ చేసి నిజానిజాలు నిగ్గు తేల్చాలని అప్పుడే ఎవరు తప్పు చేశారో తేలుతుందని అన్నారు. ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో మత వర్గాల పేరుతో అల్లర్లు సృష్టించాలని బిజెపి, టిడిపి, జనసేన చూస్తాన్నాయని, వీరి వందరోజుల పాలనలో ప్రజలకు ఏమిచేసింది లేకపోవడంతో ఇలాంటి తప్పుడు మాటలు చెప్పి లబ్ధి పొందాలని అనుకుంటున్నారని, ప్రజలు వీరి మాటలు నమ్మి మోసపోవద్దు తెలిపారు. అలాగే జగన్‌ మోహన్‌రెడ్డి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి కూటమి నాయకులు, హిందూ సంఘాలు డిక్లరేషన్‌ అడగడం విడ్డూరంగా ఉందన్నారు. ఎప్పుడూ అడగని డిక్లరేషన్‌ ఇప్పుడు అడగడం కేవలం రాజకీయ లబ్దికోసమేనని విమర్శించారు. రాజ్యాంగ పదవుల్లో ఉండే సిఎం, డిప్యూటీ సిఎం ప్రమాణం చేసేటప్పుడు అన్ని మతాలను, అన్ని వర్గాలను గౌరవిస్తామని ప్రమాణం చేస్తారని, కానీ ఇప్పుడు మాత్రం కూటమి నేతలు ఒక మతం గురించి మాట్లాడడం రాజ్యాంగ ఉల్లంఘనే అవుతుందని అన్నారు. వీరు రాజ్యాంగ పదవుల్లో ఉండే అర్హత కోల్పోయారని, వెంటనే రాజీనామా చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. అలాగే మండలంలో మామిడిపల్లి ఉమా రామలింగేశ్వర ఆలయంలో మండల వైసిపి అధ్యక్షులు సువ్వాడ శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో పట్టణ వైసిపి అధ్యక్షుడు వంగపండు అప్పల నాయుడు, గిరి రఘు, వైసిపి కార్యదర్శి దండి శ్రీనివాసరావు, కౌన్సిలర్లు, సర్పంచులు, ఎంపిటిసిలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.కురుపాం : లడ్డుపై కూటమి నాయకులు రాజకీయం చేస్తూ మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారని మాజీ ఉపముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి అన్నారు. కురుపాం సమీపాన కస్పాగదవలసలో గల వెంకటేశ్వర స్వామి ఆలయంలో చంద్రబాబు నాయుడు మనసు మారి ప్రజలకు మంచి చేయాలని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం విలేకరుల సమావేశంలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పడి వంద రోజులైనా ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి కూడా అమలు చేయకుండా ప్రజలను పక్కదారి పట్టిస్తూ లడ్డు రాజకీయం చేస్తూ మత విధ్వంశాలను రెచ్చగొడుతూ ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నారని విమర్శించారు. ఇప్పటికైనా అనవసరమైన రాజకీయాలు మానేసి తిరుపతి లడ్డుపై సిబిఐ దర్యాప్తు జరిపించి ప్రజలకు నిజాలు తెలియజేయాలని అన్నారు. కార్యక్రమంలో ఎంపిపిలు శెట్టి పద్మావతి, కె.దీనమ్మయ్య, జడ్పిటిసిలు జి.సుజాత, ఎం.శశికళ, రాధ, మండల కో-ఆప్షన్‌ సభ్యులు షేక్‌ జిలానీ, సర్పంచ్‌ జి.సుజాత, ఉప సర్పంచ్‌ షేక్‌ ఆదిల్‌, వైసీపీ జిల్లా అధికార ప్రతినిధి శెట్టి నాగేశ్వరరావు, వైస్‌ ఎంపీపీలు అన్నాజీరావు, రంగారావు, ఎంపిటిసిలు వి.బంగారునాయుడు, టివిఎస్‌ స్వామియోజులు, జి.విద్యారాణి వైసీపీ నాయకులు, కార్యకర్తలు సంఖ్యలో పాల్గొన్నారు.పార్వతీపురం టౌన్‌ : రాష్ట్ర ప్రజలను పట్టించడంలో చంద్రబాబు నాయుడు దిట్ట అని జిల్లా వైసిపి అధ్యక్షులు శత్రుచర్ల పరీక్షిత్‌ రాజు, మాజీ ఎమ్మెల్యే జోగారావు విమర్శించారు. తిరుపతి లడ్డూలో కల్తీ జరిగిందని అసత్య ప్రచారం చేస్తూ అపచారానికి ఒడిగట్టిన చంద్రబాబునే శిక్షించాలని, ప్రజలను రక్షించాలని కోరుకుంటూ దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మున్సిపల్‌ చైర్‌పర్సన్‌, వైస్‌ చైర్మన్లు, మూడు మండలాల ఎంపిపిలు, జెడ్‌పిటిసిలు, వైస్‌ ఎంపిపిలు, మాజీ ఎఎంపి చైర్‌పర్సన్‌, మూడు మండలాల, పట్టణ పార్టీ అధ్యక్షులు, నియోజకవర్గ స్థాయి సీనియర్‌ నాయకులు, ప్రజా ప్రతినిధులు, కౌన్సిలర్‌ సభ్యులు, కోఆప్షన్‌ సభ్యులు, సర్పంచులు, ఎంపిటిసి సభ్యులు, వైసిపి సీనియర్‌ నాయకులు, కార్యకర్తలు, మాజీ స్టేట్‌ డైరెక్టర్లు, ఎఎంసి మాజీ డైరెక్టర్లు, పిఎసిఎస్‌ మాజీ చైర్మన్లు డైరెక్టర్లు, జెసిఎస్‌ కన్వీనర్లు, సచివాలయం కన్వీనర్లు, గృహ సారధులు పాల్గొన్నారు.బలిజిపేట : చంద్రబాబునాయుడుకు సద్బుద్ధి ప్రసాదించాలని కోరుతూ బలిజిపేటలో వైసిపి శ్రేణులు పాప ప్రక్షాళన పూజలు వెంకటేశ్వరస్వామి దేవాలయంలో నిర్వహించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ అలజంగి రవి, మండల వైసిపి అధ్యక్షులు మురళి, ఎంపిపి నాగమణి, వైస్‌ ఎంపిపి సాయి, సర్పంచులు, ఎంపిటిసి సభ్యులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.పాలకొండ : స్థానిక వెంకటేశ్వర స్వామి ఆలయంలో చంద్రబాబు నాయుడు చేస్తున్న అసత్య ప్రచారాన్ని మానుకోవాలని కోరుతూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ పి.విక్రాంత్‌ మాట్లాడుతూ తిరుపతి లడ్డు విషయంలో చంద్రబాబు నాయుడు లేనిపోని ఆరోపణలు చేసి కుల్లు రాజకీయాలు చేస్తున్నారని అన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే విశ్వసరాయి కళావతి, చైర్‌పర్సన్‌ యందవ రాధాకుమారి, వైస్‌ ఎంపిపి కనపాక సూర్యప్రకాష్‌, వెలమల మన్మధరావు, కడగల రమణ, తుమ్మగుంట శంకరరావు, తూముల లక్ష్మణ, తదితరులు ఉన్నారు.

➡️