ఉపాధి నిధులు పక్కదారి పట్టించొద్దు

Oct 28,2024 21:42

ప్రజాశక్తి-శృంగవరపుకోట : పంచాయతీలకు కేటాయించిన ఉపాధి హామీ నిధులను పక్కదారి పట్టించొద్దని సర్పంచులు, ఎంపిటిసిలు.. మండల అధికారులకు సోమవారం వినతిపత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా జెడ్‌పిటిసి వెంకటలక్ష్మి, ఎంపిపి-2 పినిశెట్టి రమణ మాట్లాడుతూ ఉపాధి హామీ నిధులతో గ్రామసభల తీర్మానంతోనే పనులు చేపట్టాల్సి ఉందన్నారు. గ్రామసభ తీర్మానం లేకుండా ఇతరులతో పనులను చేపట్టి, నిధులు పక్కదారి పట్టించొద్దని కోరారు. దీనిపై ఎంపిడిఒ, పంచాయతీరాజ్‌ జెఇ, ఆర్‌డబ్ల్యుఎస్‌ ఎఇ, సబ్‌ డివిజన్‌ అధికారికి వినతులను అందజేశారు. వేపాడ : ఉపాధి హామీ పనులను పంచాయతీల ద్వారానే చేపట్టాలని మండలంలోని సర్పంచులు, ఎంపిటిసిలు.. ఎంపిడిఒ సూర్యనారాయణ, ఎపిఒ, పిఆర్‌ జెఇని కలిసి వినతులిచ్చారు. ఆ పనుల బిల్లులు, నగదు చెల్లింపులు కూడా గ్రామ పంచాయతీ ఉపాధి హామీ బ్యాంకు అకౌంట్‌ ద్వారా చేపట్టాలని విజ్ఞప్తిచేశారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి డి.సత్యవంతుడు, జెడ్‌పిటిసి సేనాపతి అప్పలనాయుడు, తదితరులు పాల్గొన్నారుపంచాయతీ ఖాతా ద్వారే పనులు పూసపాటిరేగ: ఉపాధి హామీ ద్వారా పనులకు సంబంధించిన చెల్లింపులు గ్రామ పంచాయతీ ఉపాధి హామీ బ్యాంక్‌ అకౌంట్‌ నుంచే జరగాలని వైసిపి సర్పంచులు కోరారు. సోమవారం ఎంపిడిఒ రాధికకు గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేశారు. మంజూరైన పనులను గ్రామపంచాయతీ ద్వారానే చేపట్టేలా జరిగి, బిల్లులు కూడా ఆ అకౌంట్‌ నుంచే మంజూరు చేయాలని కోరారు. వినతి అందించిన వారిలో పతివాడ అప్పలనాయుడు, వైస్‌ ఎంపిపి అల్లాడి రమేష్‌, మహంతి శ్రీనివాసరావు, టొంపల సీతారాం, కొత్తకోట శ్రీరాములు, డి.గణేష్‌, రైతు శ్రీరామ్‌మూర్తి, పిన్నింటి కుమార్‌ తదితరులు పాల్గొన్నారు. రామభద్రపురం : ఉపాధిహామీ ద్వారా మంజూరవుతున్న వివిధ పనులు గ్రామ పంచాయతీల ద్వారానే చేపట్టాలని సర్పంచ్‌లు డిమాండ్‌ చేశారు. ఎంపిడిఒ రత్నంకు వినతిపత్రం అందించారు. ఈ పనులకు సంబంధించి బిల్లులు,నగదు చెల్లింపులు కూడా గ్రామ పంచాయతీ ద్వారా ఉపాధిహామీ బ్యాంకు అకౌంట్‌ ఏర్పాటు చేసి దాని ద్వారానే లావాదేవీలు జరపాలని ఆరికతోట సర్పంచ్‌ పెంకి పుష్పమ్మ,రావివలస సర్పంచ్‌ ఎస్‌.కుమారి, దుప్పలపూడి సర్పంచ్‌ వైకుంఠం విజయ భాస్కరరావు డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో అప్పలరాజుపేట సర్పంచ్‌ రమ్య, జన్నివలస సర్పంచ్‌ సారంగిదొర తదితరులు పాల్గొన్నారు.

➡️