ప్రజాశక్తి – సాలూరు: ”పేదల సేవ” కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గ్రుమ్మిడి సంధ్యా రాణి ఇంటింటికీ వెళ్లి పింఛన్లు పంపిణీ చేశారు. ప్రతి నెలా ఒకటో తేదీన పంపిణీ చేసే ఎన్‌టిఆర్ భరోసా పింఛన్లు పంపిణీ కార్యక్రమంలో మంత్రి సంధ్యారాణి సాలూరు పట్టణంలోని 26వ వార్డులో చెరువుగట్టు, వెంకటేశ్వర కాలనీలో మంగళవారం పాల్గొన్నారు. వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు తదితర అన్ని వర్గాల ప్రజలకు పంపిణీ చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ పింఛన్లు పెంచడంతో లబ్ధిదారులు ఎంతో సంతోషంగా ఉన్నారని తెలిపారు. జిల్లాలో 1.42 లక్షల మందికి రూ.59.37 కోట్లను పంపిణీ చేస్తున్నామని ఆమె చెప్పారు. బెలగాం అగ్రహారంలో జిల్లా కలెక్టర్ పంపిణీపార్వతీపురం : పట్టణం బెలగాం అగ్రహారంలో పేదలకు సేవలో భాగంగా పింఛన్ల పంపిణీలో జిల్లా కలెక్టర్ ఏ శ్యామ్ ప్రసాద్ పాల్గొన్నారు. లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేశారు. ఒక్క రోజులోనే శత శాతం పంపిణీకి చర్యలు చేపట్టామని ఆయన తెలిపారు. జిల్లా వ్యాప్తంగా చేపడుతున్న ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారులు, మండల అధికారులు, గ్రామ సచివాలయ సిబ్బంది పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మున్సిపాలిటీలలో మున్సిపల్ కమిషనర్లు పింఛన్లు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు.పార్వతీపురంరూరల్ : మండలంలోని నర్సిపురంలో ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు. కార్యక్రమంలో టిడిపి జిల్లా ఉపాధ్యక్షులు గొట్టాపు వెంకట నాయుడు మాజీ వైస్ ఎంపిపి గొట్టాపు గౌరి, ఎంపిటిసి ఏగిరెడ్డి తవిటి నాయుడు కార్యకర్తలు పాల్గొన్నారు.గుమ్మలక్ష్మీపురం : ప్రతి నెలా ప్రభుత్వం అందించే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పేదవారికి ఆసరాగా ఉంటుందని కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి అన్నారు. మండలంలోని జెకెపాడులో ఎన్టీఆర్ భరోసా పెన్షన్‌ను ఆమె పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపిడిఒ సాల్మన్ రాజు,టిడిపి నాయకులు తోయక దామోదర్, కడ్రక రాజు, కంచర్ల భాను, ప్రసన్న ఉన్నారు.