డిఎస్‌సిని మినహాయించాలి

Nov 5,2024 21:33

ప్రజాశక్తి – సాలూరురూరల్‌ : ఐటిడిఎ పరిధిలో గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులను 2014 డిఎస్‌సి నుంచి మినహాయించాలని కోరుతూ గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు మంగళవారం గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణికి వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్‌ ఉపాధ్యాయ పోస్టులను డిఎస్‌పి నుంచి మినహాయించాలన్నారు. గత కొన్నేళ్లుగా గిరిజన విద్యార్థులకు సంక్షేమ పాఠశాలలో కాంట్రాక్ట్‌ ఉపాధ్యాయులుగా పని చేస్తున్నామని, గత ప్రభుత్వం 2014 ముందున్న అందరినీ రెగ్యులర్‌ చేసి టిడిపి హయాంలో నియమింపబడిన కొందరిని రెగ్యులర్‌ చేయకుండా నిలిపివేసిందని అన్నారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించి డిఎస్‌సి నుంచి తమ పోస్టులను మినహాయించి రెగ్యులర్‌ చేయాలని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 1200 మంది కాంట్రాక్టు ఉద్యోగులుగా పనిచేస్తున్నామని, చాలిచాలని జీతాలతో పనిచేస్తున్న తమలాంటి గిరిజనులకు, తమ బాధలు తెలిసిన ఈ ప్రాంతానికి చెందిన గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా ఉండడం తమకు న్యాయం చేయాలని కోరుతున్నామని తెలిపారు. దీనికి సమాధానంగా పై విషయాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టిలో పెడతామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో సిఆర్‌టియు యూనియన్‌ నాయకులు కె.చంద్రశేఖర్‌, కె.బాలరాజు, అప్పికొండ, గణపతిరావు పాల్గొన్నారు.

➡️